మొన్న బ్యాటుతో, నేడు బాల్‌తో... ఎవరీ అజాజ్ పటేల్? ముంబైలో పుట్టి, టీమిండియాపైనే ఇలా...

First Published Dec 3, 2021, 6:12 PM IST

ఇక్కడ పుట్టి, అవకాశాలను వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్లి స్టార్లుగా ఎదిగిన వాళ్లు ఎందరో. అలాంటి వారిలో భారత సంతతి కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ కూడా చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది...

ఉపఖండ పిచ్‌ల గురించి సరైన అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో భారత్‌లో ఆడేటప్పుడు ఇద్దరు భారత సంతతి ప్లేయర్లకు టీమ్‌లో చోటు కల్పించింది న్యూజిలాండ్ జట్టు...

కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడింది ఈ ఇద్దరే. రాహుల్ ద్రావిడ్‌లోని రా, సచిన్‌లో చిన్ కలిపి పేరుగా పెట్టుకున్న రచిన్ రవీంద్రతో పాటు అజాజ్ పటేల్‌ వికెట్లకు అడ్డుగా నిలబడి, భారత జట్టు విజయాన్ని దూరం చేశారు...

రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, ఆఖరి వికెట్‌ని తీయలేకపోవడానికి కారణం ఈ ఇద్దరూ భారత స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే...

ముంబై టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, రెండో ఓవర్ల నుంచే దూకుడుగా ఆడడం మొదలెట్టింది. కేల్ జెమ్మీసన్‌తో పాటు టిమ్ సౌథీ బౌలింగ్‌లో కూడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు భారత ఓపెనర్లు...

న్యూజిలాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఫెయిల్ అయిన చోట, ముంబైలో పుట్టిన అజాజ్ పటేల్... సొంత గడ్డపై చిరకాలం గుర్తుండిపోయే బౌలింగ్ వేశాడు...

శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టిన అజాజ్ పటేల్, ఆ తర్వాత కొద్దిసేపటికే ఛతేశ్వర్ పూజారాను క్లీన్ బౌల్డ్ చేశాడు...

విరాట్ కోహ్లీ అవుట్ విషయంలో వివాదం నెలకొన్నా, గత మ్యాచ్‌లో సెంచరీ చేసి అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు అజాజ్ పటేల్...

తొలి రోజు ఆటలో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోతే, నాలుగుకి నాలుగు వికెట్లు తీసింది ఈ ముంబై బార్న్ బౌలరే. అజాజ్ పటేల్‌కి 8 ఏళ్లు ఉన్నప్పుడే, వారి కుటుంబం న్యూజిలాండ్‌కి వలస వెళ్లిపోయింది...

ఇండియాలో జరిగిన టెస్టులో మొదటి నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.  ఇంతకుముందు అక్లాండ్‌లో ఆసీస్‌పై మరో భారత సంతతి కివీస్ బౌలర్ దీపక్ పటేల్ ఈ ఫీట్ సాధించాడు...

ఇండియాలో పుట్టి, జన్మస్థలంలో ప్రత్యర్థి జట్టు తరుపున బరిలో దిగిన రెండో భారత సంతతి క్రికెటర్ అజాజ్ పటేల్. ఇంతకుముందు 1933లో ఇంగ్లాండ్ ప్లేయర్ డగ్లస్ జార్డిన్ ముంబైలో పుట్టి, ఇంగ్లాండ్ తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు...

తొలి రోజు నాలుగు వికెట్లు తీసిన అజాజ్ పటేల్, మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత న్యూజిలాండ్ జట్టుకి నాయకత్వం వహిస్తూ ముందు నడిచాడు. 

click me!