Published : Dec 03, 2021, 12:03 PM ISTUpdated : Dec 03, 2021, 12:06 PM IST
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఒకే ఒక్క వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకుంది టీమిండియా. కాన్పూర్ టెస్టులో ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగడంతో రెండో టెస్టుకి ముందు టీమిండియాకి ప్లేయింగ్ ఎలెవన్ పెద్ద సమస్యగా పరిగణించారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్...
మొదటి టెస్టులో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తుండడంతో కాన్పూర్ టెస్టు ఆడిన ఏ ప్లేయర్‌ను తప్పించి, కెప్టెన్‌కి టీమ్‌లో చోటు కల్పిస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది...
214
విరాట్ కోహ్లీ ఎంట్రీతో వైస్ కెప్టెన్ అజింకా రహానేని తప్పించాలని కొందరు, కాదు సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని తప్పించాలని మరికొందరు కామెంట్లు చేశారు...
314
విరాట్ కోహ్లీ ఎంట్రీతో వైస్ కెప్టెన్ అజింకా రహానేని తప్పించాలని కొందరు, కాదు సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని తప్పించాలని మరికొందరు కామెంట్లు చేశారు...
414
వాళ్లు, వీళ్లు కాదు... ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ టీమ్‌లోకి రానున్నాడని, పూజారా, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడని టాక్ వినిపించింది...
514
అయితే రెండో టెస్టు ఆరంభానికి ముందు ఏకంగా ముగ్గురు ప్లేయర్లు గాయపడడం, వారి స్థానంలో టీమ్‌లోకి కొత్త ప్లేయర్లు రావడంతో ప్లేయింగ్ ఎలెవన్ సెలక్షన్‌లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు...
614
అయితే కరెక్టుగా మ్యాచ్ ఆరంభానికి ముందు ముగ్గురు ప్లేయర్లు గాయపడ్డారని బీసీసీఐ ప్రకటించడంపై క్రికెట్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...
714
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కూడా మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. దాంతో రెండో మ్యాచ్‌కి ముందు అతను గాయపడ్డాడని చెప్పి, ఇషాన్ కిషన్‌కి చోటు కల్పించారు...
814
అలాగే మొదటి రెండు మ్యాచుల్లో వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయలేకపోవడంతో అతనికి గాయమైందని చెప్పి రవిచంద్రన్ అశ్విన్‌కి టీమ్‌లో చోటు కల్పించారు...
914
ఇప్పుడు రెండో టెస్టుకి ముందు కూడా అజింకా రహానే ఫామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి, అలాగే తొలి టెస్టులో ఇషాంత్ శర్మ వికెట్లు తీయలేకపోవడతో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు...
1014
ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరూ గాయంతో బాధపడుతున్నారని ప్రకటించి, జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ. అలాగే గత ఆరు నెలలుగా బిజీ క్రికెట్ ఆడుతున్న రవీంద్ర జడేజా కూడా గాయపడ్డాడని తెలిపింది...
1114
టీమ్‌లో మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావించినప్పుడు... అప్పటికే ఉన్న ప్లేయర్లను తప్పించడం వల్ల ట్రోలింగ్ రాకుండా ఉండేందుకు గాయపడ్డారని చెప్పడమే ఉత్తమ మార్గంగా బీసీసీఐ భావిస్తోందని సోషల్ మీడియా జనాలు భావిస్తున్నారు...
1214
లేకపోతే ఈ ఏడాది కాలంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఏ మ్యాచ్‌కీ దూరం కాలేదు. అలాగే టెస్టు సిరీస్‌కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, హఠాత్తుగా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి హాజరవుతూ కనిపించాడు. బయో బబుల్‌లో ఉంటే, రాహుల్‌కి ఈ ఛాన్స్ దొరికేది కాదు..
1314
గత మ్యాచ్‌లో గాయపడి, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న వృద్ధిమాన్ సాహా కూడా ఫిట్‌గా ఉన్నప్పుడు ఈ ముగ్గురూ గాయపడడమే అనుమానాలకు తావిస్తోంది..
1414
ఒకవేళ వృద్ధిమాన్ సాహా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఫెయిల్ అయ్యి ఉంటే, అతన్ని కూడా గాయం పేరు చెప్పి జట్టు నుంచి తప్పించేవారని... రెండో ఇన్నింగ్స్‌లో సాహా చేసిన పరుగులే, అతనికి గాయం కాకుండా కాపాడాయని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...