విరాట్ కోహ్లీ ఈ విషయం చెప్పనేలేదు, అంతలోనే ఎలా... అజింకా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మల...

First Published Dec 4, 2021, 10:49 AM IST

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆరంభానికి ముందు ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు గాయపడడంపై అనుమానాలు వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...

రెండో టెస్టు ఆరంభానికి ముందు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాలతో బాధపడుతున్నారని తెలిపాడు విరాట్ కోహ్లీ...

మొదటి టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన అజింకా రహానే, బ్యాట్‌‌తో పెద్దగా రాణించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

అలాగే టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు... సరిగ్గా ఈ ఇద్దరూ రెండో టెస్టు ఆరంభానికి ముందు గాయపడ్డారని తెలపడం అనుమానాలకు తావిచ్చింది...

‘టెస్టు ఆరంభానికి ముందు ఏం జరిగింది? ఒక్కసారిగా ముగ్గురు ప్లేయర్లు ఎలా గాయపడ్డారు? విరాట్ కోహ్లీ, ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొనప్పుడు ఆటగాళ్ల గాయాల గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు...

ఒక్కసారిగా మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు గాయపడ్డారని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇది టీమిండియాకి పెద్ద దెబ్బే. స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్‌ సిరీస్‌లో రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆడలేకపోయాడు...

జడ్డూ స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్, అప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు. ఈసారి కూడా అక్షర్ పటేల్‌‌కి ఇది చక్కని అవకాశం అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...

వైస్ కెప్టెన్ అజింకా రహానే తొడ కండరాలు పట్టేయడంతో రెండో టెస్టులో బరిలో దిగకపోగా... అతని స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి వచ్చాడు...

సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చేతి వేలు బెణికింది. ఇషాంత్ శర్మ స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కి తుది జట్టులో చోటు దక్కింది...

రవీంద్ర జడేజా కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. జడ్డూ స్థానంలో స్పిన్నర్ జయంత్ యాదవ్, నాలుగేళ్ల తర్వాత తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు...

click me!