అజింకా రహానేకి ఊహించని షాక్... రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ, దక్షిణాఫ్రికా టూర్ నుంచి...

First Published Dec 4, 2021, 9:27 AM IST

భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న అజింకా రహానే, టెస్టుల్లో వైస్ కెప్టెన్ పదవినీ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది...

టీమిండియా రెగ్యూలర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హజరీలో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించేవాడు అజింకా రహానే. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు రహానే..

ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి రావడంతో మిగిలిన మూడు టెస్టులకు అజింకా రహానే సారథిగా వ్యవహరించాడు...

ఆసీస్‌లో కూల్‌ అండ్ కామ్‌గా ఉండే అజింకా రహానే కంటే దూకుడుగా వ్యవహరించే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా...

విరాట్ కోహ్లీ లేని జట్టు, ఆస్ట్రేలియా ముందు నిలవలేదని, భారత జట్టు, ఆతిథ్య జట్టు చేతుల్లో క్లీన్ స్వీప్ కావడం ఖాయమని భావించారంతా...

అయితే అజింకా రహానే కెప్టెన్సీలో భారత జట్టు సంచలన ప్రదర్శన ఇచ్చింది. మెల్‌బోర్న్ టెస్టులో గెలిచి, సిడ్నీ టెస్టు డ్రా చేసుకుని, బ్రిస్బేన్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి... టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది...

ఆ విజయం ఇచ్చిన ధీమాతో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టుకి కూడా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చిన టీమిండియా, డ్రాతో సరిపెట్టుకుంది...

ఆ విజయం ఇచ్చిన ధీమాతో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టుకి కూడా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చిన టీమిండియా, డ్రాతో సరిపెట్టుకుంది...

అయితే వైస్ కెప్టెన్ అజింకా రహానే వరుసగా విఫలం అవుతుండడంతో అతనిపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. అతను ఆ పొజిషన్‌కి కరెక్ట్ కాదని విమర్శలు చేస్తున్నారు విశ్లేషకులు...

దీంతో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించబోతున్నాడు. టీ20 కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ, గబ్బా టెస్టులకు వైస్ కెప్టెన్‌‌గా వ్యవహరించాడు...

సౌతాఫ్రికా ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా విస్తరిస్తుండడంతో ఈ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అనుకున్న షెడ్యూల్ కంటే మరో వారం వాయిదా వేసి, కరోనా కేసుల పురోగతిని బట్టి టూర్‌పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది బీసీసీఐ...

మొదటి టెస్టులో బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన అజింకా రహానే, రెండో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రహానే గాయంతో బాధపడుతున్నాడని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించినా, అతని పర్ఫామెన్స్ బాగోలేదని గాయం వంకతో పక్కన పెట్టాడని టాక్ వినబడుతోంది...

వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ సౌతాఫ్రికా పర్యటనకు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలను ఎంపిక చేస్తారని... సీనియర్లను ఎలా వాడుకోవాలనే హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇష్టానికి బీసీసీఐ వదిలేసిందని సమాచారం...

click me!