అశ్విన్ అడిగాడు, ట్విట్టర్ ఇచ్చేసింది... అజాజ్ పటేల్‌కి అందులో అధికారికంగా...

First Published Dec 7, 2021, 3:21 PM IST

న్యూజిలాండ్, టీమిండియా టూర్‌లో తమ పర్ఫామెన్స్‌తో అందర్నీ ఆకర్షించిన క్రికెటర్లు భారత్‌లో జన్మించిన కివీస్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్...

కాన్పూర్ టెస్టులో ఆఖరి అరగంట వికెట్ కాపాడుకుని, టీమిండియాకి విజయం దక్కకుండా చేశారు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్...

ఆ తర్వాత ముంబై టెస్టులో అజాజ్ పటేల్, అద్భుతాన్ని మించిన పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి... ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నాడు...

1956లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లాకర్, 1999లో టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు అజాజ్ పటేల్...

తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అజాజ్ పటేల్, 12 మెయిడిన్లలో 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు...

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కోల్పోయిన 7 వికెట్లలో అజాజ్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, రచిన్ రవీంద్రకు మూడు వికెట్లు దక్కాయి. సీనియర్లు టిమ్ సౌథీ, యంగ్ సెన్సేషనల్ కేల్ జెమ్మీసన్‌లకు వికెట్లు దక్కలేదు...

ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన రవిచంద్రన్ అశ్విన్, అతనికి జ్ఞాపకంగా భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని కానుకగా అందించాడు...

ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో అజాజ్ పటేల్‌కి అధికారిక వెరిఫైడ్ టిక్ మార్క్ లేకపోవడం చూసి, ఇలాంటి బౌలర్‌కి వెరిఫికేషన్ టిక్ ఇవ్వకపోతే ఎలా అంటూ ట్విట్టర్‌ను కోరాడు...

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోరికను మన్నించిన ట్విట్టర్, వెంటనే అజాజ్ పటేల్‌ ఖాతాకు వెరిఫికేషన్ టిక్ మార్క్ ఇచ్చేసింది...

అలాగే 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్‌కి జ్ఞాపకంగా ముంబై క్రికెట్ అసోసియేషన్, స్కోర్ బోర్డును లామినేట్ చేసి బహుకరించింది...

click me!