స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పూర్తి డామినేషన్ చూపించింది భారత జట్టు. కాన్పూర్ టెస్టులో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని దూరం చేసుకున్న భారత జట్టు, ముంబై టెస్టులో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది...
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 62 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకి పరిమితం చేసి 372 పరుగుల తేడాతో టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది...
215
అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజరా అవుట్ అయిన విధానంపై విమర్శలు చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
315
‘ఛతేశ్వర్ పూజారా ఇన్నింగ్స్ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఓపెనింగ్ చేయలేదు, కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది...
415
47 పరుగులు చేసిన పూజారా, 3 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా వచ్చినా హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం పూజారాకి మంచిది కాదు...
515
అయితే 47 పరుగులు చేయడమంటే ఫెయిల్ అయినట్టేం కాదు కానీ గత రెండేళ్లుగా అతను సెంచరీ చేయలేకపోయిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పూజారా ఫామ్ ఇలాగే కొనసాగితే అతనికి టీమ్‌లో చోటు ఉంటుందా? అనేది అనుమానమే...
615
జట్టులో స్థానం కాపాడుకోవడానికి అవసరమైన పరుగులైతే పూజారా చేస్తున్నాడు. ఓ ఎండ్‌లో వికెట్లను కాపాడుకుంటూ పాతుకుపోయి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్‌మెన్ కావాలి...
715
ఆ విషయంలో పూజారాని మించిన ప్లేయర్లు లేరు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతను అవుటైన విధానం మరీ హాస్యాస్పదంగా అనిపించింది. దాదాపు 100 బంతులు ఆడిన పూజారా, అలా అవుట్ అవ్వడం, తను ఎలాంటి మెంటల్ పొజిషన్‌లో ఉన్నాడో తెలుపుతోంది...
815
పూజారాతో పోలిస్తే, విరాట్ కోహ్లీ పరిస్థితి వేరు. టెస్టులు, వన్డేలు, టీ20లంటూ ప్రతీ వారం ఏదో ఒక ఫార్మాట్‌లో ఆడుతూనే కనిపించాడు విరాట్ కోహ్లీ...
915
అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు ఈజీగా పరుగులు సాధించడమెలాగో బాగా తెలిసి ఉండాలి. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడని అనుకున్నా...
1015
అయితే విరాట్ కోహ్లీ అవుటైన విధానం, నమ్మశక్యంగా లేదు. ఎంతోమంది స్పిన్నర్లను ఫేస్ చేస్తున్న విరాట్ కోహ్లీ, తన టెక్నికల్ లోపాలను సరి చేసుకోవడంపై దృష్టి పెట్టడం లేదు...
1115
జట్టు గెలిచినా, విరాట్ కోహ్లీ పరుగులు చేస్తే వచ్చే ఉత్సాహం వేరేగా ఉంటుంది. అది ఇప్పుడు భారత జట్టుకి చాలా అవసరం, విరాట్‌కి ఆ విషయం తెలియనిది కాదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
1215
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఛతేశ్వర్ పూజారా, శుబ్‌మన్ గిల్ గాయపడడంతో రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. తొలి వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..
1315
51 బంతుల్లో 41 పరుగులు చేసి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత 46 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పూజారా...
1415
తొలి ఇన్నింగ్స్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసి, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
1515
51 బంతుల దాకా బౌండరీ లేకుండా జిడ్డు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సిక్సర్ బాది వేగం పెంచినట్టే అనిపించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో కోహ్లీ బ్యాట్ ఎడ్జ్‌కి తగిలిన బంతి, నేరుగా వికెట్లను గిరాటేయడంతో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది..