ఆ ఇద్దరూ రాణిస్తే, టీమిండియాకి పెద్ద సమస్యే... మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ స్థానాలపై...

Published : Nov 25, 2021, 10:17 AM IST

టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్వీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టెస్టు సిరీస్‌ను ఆరంభించింది. కివీస్ గడ్డపై ఎలా ఉన్నా, స్వదేశంలో మాత్రం భారత జట్టుకి న్యూజిలాండ్‌పై ఘనమైన రికార్డు ఉంది...

PREV
115
ఆ ఇద్దరూ రాణిస్తే, టీమిండియాకి పెద్ద సమస్యే... మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ స్థానాలపై...

చివరిగా 1988లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడింది భారత జట్టు. 33 ఏళ్లుగా భారత జట్టుపై ఇండియా గడ్డ మీద టెస్టు మ్యాచ్ గెలవలేకపోయింది న్యూజిలాండ్...

215

1999లో 1-0 తేడాతో, 2010లో 1-0 తేడాతో, 2012లో 2-0 తేడాతో, 2016లో 3-0 తేడాతో సిరీస్‌లు సొంతం చేసుకున్న భారత జట్టు, 2003లో రెండు టెస్టులను డ్రాలుగా ముగించింది...

315

రోహిత్ శర్మ ఈ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రాగా, మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశం దక్కింది...

415

ఇప్పటికే భారత జట్టు టెస్టు టీమ్‌లో చోటు కోసం బీభత్సమైన పోటీ ఉంది. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఈ టెస్టు సిరీస్‌లో ఆడడం లేదు...

515

ఓపెనర్లుగా ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి అదరగొడితే, భారత జట్టుకి కొత్త సమస్య ఎదురవుతుంది. అది ఓపెనర్ సమస్యే...

615

రోహిత్ శర్మ స్టార్ ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలో తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. అతనికి మరో ఎండ్‌లో ఎవరిని ఆడించాలనేది మాత్రం నిర్ణయించాల్సి ఉంటుంది...

715

మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా టూర్‌లో రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. మెల్‌బోర్న్ టెస్టులో రాణించిన శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాడు...

815

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. అయినా అతని ఫామ్‌ ఆధారంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు శుబ్‌మన్ గిల్... 

915

ఇంగ్లాండ్ టూర్‌కి ముందు శుబ్‌మన్ గిల్ గాయపడడంతో మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపించాలని భావించింది టీమిండియా. అయితే తొలి టెస్టు ఆరంభానికి ముందు మయాంక్ అగర్వాల్ కూడా గాయపడ్డాడు...

1015

దీంతో కెఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మతో కలిసి శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడంతో కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించింది భారత జట్టు...

1115

మయాంక్ అగర్వాల్‌కి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పృథ్వీషా గాయపడడంతో అతని స్థానంలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మయాంక్ అగర్వాల్, మెల్‌బోర్న్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో 76 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు ఆరంగ్రేటం చేస్తూ అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్ మయాంక్...

1215

తన తొలి టెస్టు సెంచరీనే ద్విశతకంగా మలిచిన మయాంక్ అగర్వాల్, 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్, సెహ్వాగ్ తర్వాత ఈ రికార్డు క్రియేట్ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

1315

తన ఎనిమిదో టెస్టులోనే రెండో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్, బ్రాడ్‌మన్ కంటే వేగంగా రెండు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు...

1415

అత్యంత వేగంగా టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్... రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కారణంగా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోంది...

1515

న్యూజిలాండ్‌ సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ క్లిక్ అయితే, ఓపెనింగ్ పొజిషన్ కోసం నలుగురు మధ్య పోటీ ఏర్పడుతుంది. రోహిత్ శర్మకు మరో ఎండ్‌లో ఆడేందుకు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ పోటీ పడాల్సి ఉంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories