కీలక సమయాల్లో రోహిత్ శర్మకు సలహాలు ఇవ్వడం తప్ప, విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ కెప్టెన్‌గా కనిపించలేదు. ప్రస్తుతం కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గైర్హజరీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో కొత్త కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాకి సలహాలు, సూచనలు ఇస్తూ... మాజీ కెప్టెన్‌గా తన బాధ్యత నిర్వర్తిస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ...