అప్పుడు ఆడించలేదు, ఇప్పుడు ఆడించాలనుకుంటే... అశ్విన్‌కి కలిసిరాని ఇంగ్లాండ్ టూర్...

Published : Jun 21, 2022, 11:56 AM IST

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లలేదు. మరో 9 రోజుల్లో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుండడంతో అశ్విన్ లేనిలోటు టీమిండియాపై ఏ విధంగా పడుతుందోనని భయపడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

PREV
110
అప్పుడు ఆడించలేదు, ఇప్పుడు ఆడించాలనుకుంటే... అశ్విన్‌కి కలిసిరాని ఇంగ్లాండ్ టూర్...

వాస్తవానికి ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కారణం నలుగురు ఫాస్ట్ బౌలర్లను తుదిజట్టులోకి తీసుకున్న అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాని ఆడించాడు.. 

210

రెండో టెస్టు ఆడతానని, కాదు మూడో టెస్టు ఆడబోతున్నానంటూ... లేదు లేదు, ఈసారి కచ్ఛితంగా నాలుగో టెస్టులో ఉంటానని ఆశపడి, మీడియాకి చెబుతూ వచ్చిన రవిచంద్రన్ అశ్విన్... బ్యాటింగ్ ప్రాక్టీస్, బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం తప్ప ఒక్క టెస్టు కూడా ఆడలేదు...

310

ఈ సిరీస్ సమయంలోనే తనను ఆడించకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీని నిలదీశాడని... దీంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. కోహ్లీ ప్రవర్తనపై అశ్విన్, బీసీసీఐకి కంప్లైంట్ చేశాడని కూడా పుకార్లు వ్యాపించాయి...
 

410

ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టు ఆరంభానికి ముందు భారత బృందంలోని హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా అప్పటి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తదితరులు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...

510

ఈ నిర్ణయం తర్వాత నేరుగా యూఏఈ చేరుకుని ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పాల్గొన్నారు భారత క్రికెటర్లు. ఈ సమయంలోనే రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీతో గొడవలున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు...
 

610

ఇంగ్లాండ్ టూర్‌కి ముందు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో శుబ్‌మన్ గిల్ గాయపడడం, సిరీస్‌కి ప్రధాన ఓపెనర్‌గా సెలక్ట్ అయిన మయాంక్ అగర్వాల్... తొలి టెస్టుకి ముందు గాయపడడంతో దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్...

710

అనుకోకుండా తుదిజట్టులోకి వచ్చి అద్భుతంగా రాణించి, టీమిండియాకి టెస్టు వైస్ కెప్టెన్‌గా మారిపోయాడు కెఎల్ రాహుల్. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, ఈ ఐదో టెస్టుకి అందుబాటులో ఉండడం లేదు.

810

ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్, ఐదో టెస్టుకి ముందు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, భారత జట్టుతో కలుస్తాడా? కలిసినా కరోనా నుంచి కోలుకున్న వెంటనే అతనికి తుదిజట్టులో చోటు దక్కుతుందా? అనేది అనుమానమే...

910
Jonny Bairstow-Ben Stokes

కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్ టెస్టు టీమ్ పర్ఫామెన్స్, ఆటతీరు పూర్తిగా మారిపోయింది. న్యూజిలాండ్‌పై ఘన విజయాలు అందుకుంది ఇంగ్లాండ్...

1010

అలాంటి ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించాలంటే టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే. టెస్టు సారథిగా కేవలం రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న రోహిత్ శర్మ, ఐదో టెస్టులో భారత జట్టును ఎలా నడిపిస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది..

click me!

Recommended Stories