హార్ధిక్ పాండ్యాకి బోనస్ విత్ ప్రమోషన్... ఇంగ్లాండ్‌ టూర్‌లోనూ టీమిండియా కెప్టెన్‌గా పాండ్యా...

First Published Jun 30, 2022, 12:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఐపీఎల్‌కి ముందు పేలవ ప్రదర్శనతో టీమిండియాలో చోటు కూడా కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు..

Image credit: PTI

కెఎల్ రాహుల్ గాయపడడం, రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడం, శిఖర్ ధావన్‌ని టీ20లకు దూరంగా పెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడంతో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ హార్ధిక్ పాండ్యాకి దక్కింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, తొలి సీజన్‌లోనే ఆ జట్టును టైటిల్ ఛాంపియన్‌గా నిలిపాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ రేసులో పాండ్యా, మిగిలిన వారిని వెనక్కి నట్టి టాప్ గేర్‌లో ముందుకు దూసుకొచ్చినట్టైంది...
 

ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించి టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్‌కి కూడా సారథిగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ కోసం లండన్‌లో వాలిపోయింది భారత జట్టు...

జూలై 1 నుంచి భారత జట్టు, ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆడుతుంటే, అదే రోజు డర్బీషైర్ క్లబ్‌తో వార్మప్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. ఆ తర్వాత జూలై 3న నార్తప్టన్‌షైర్ కౌంటీ టీమ్‌తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది...
 

ఆ తర్వాత జూలై 7 నుంచి 10 వరకూ ఇంగ్లాండ్ టీమ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత 12 నుంచి 17 వరకూ వన్డే సిరీస్ జరుగుతుంది... కరోనా బారిన పడిన రోహిత్ శర్మ, ఐదో టెస్టు ఆడకపోయినా టీ20 సిరీస్ సమయానికి భారత జట్టులోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
 

అయితే భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతుంటే కౌంటీ టీమ్‌లతో జరిగే వార్మప్ మ్యాచులు ఆడే టీమిండియాకి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐదో టెస్టు ఆరంభమయ్యే రోజే ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించబోతోంది బీసీసీఐ...

Image credit: PTI

టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తే చాలనుకున్న హార్ధిక్ పాండ్యాకి బోనస్‌తో పాటు ప్రమోషన్ కూడా వచ్చినట్టు... జట్టులో చోటుతో పాటు కెప్టెన్సీ కూడా అవకాశం దక్కడం విశేషం. రోహిత్ శర్మ అందుబాటులో లేని మ్యాచులకు హార్ధిక్ పాండ్యానే కెప్టెన్‌గా నియమించాలని ఆలోచనలు చేస్తోందట బీసీసీఐ..

click me!