వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పరువు నిలిపిన శ్రీకర్ భరత్... ఐదో టెస్టులో తెలుగోడికి చోటు దక్కేనా...

First Published Jun 24, 2022, 12:58 PM IST

దేశవాళీ టోర్నీల్లో అత్యద్భుతంగా రాణిస్తున్నా, అంతర్జాతీయ స్థాయిలో ఒక్క అవకాశం కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన శ్రీకర్ భరత్, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లడంతో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు...

Virat Kohli

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి ముందు లంకాషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది భారత జట్టు. విరాట్ కోహ్లీ 33, రోహిత్ శర్మ 25, శుబ్‌మన్ గిల్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

భారత టాప్ క్లాస్ ప్లేయర్లు పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా శ్రీకర్ భరత్ 111 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా భారత ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ భరత్...
 

కెఎస్ భరత్ హాఫ్ సెంచరీ చేయడంతో ఐదో టెస్టుకి ముందు టీమిండియా మేనేజ్‌మెంట‌్‌కి కొత్త తలనొప్పి మొదలైంది. రిషబ్ పంత్ కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగింది...
 

ఈ కారణంగానే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో రిషబ్ పంత్‌కి బదులుగా ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్‌లను ఆడించడమే బెటర్ కూడా మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు టెస్టుల్లో కూడా రిషబ్ పంత్ పొజిషన్‌ ఇదే...

KS Bharat

కెఎస్ భరత్ హాఫ్ సెంచరీతో ఫామ్‌లో లేని రిషబ్ పంత్‌ని ఆడించి, టీమిండియాల్లో చిక్కుల్లో పడేసే బదులు.. ఫామ్‌లో ఉన్న తెలుగోడికి తుదిజట్టులో చోటు కల్పించాలని కోరుతున్నారు అభిమానులు.. 

ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ వికెట్ కీపర్ కావడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో 2 మ్యాచులు మాత్రమే ఆడాడు శ్రీకర్ భరత్. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున 8 మ్యాచులు ఆడి 38.20 సగటుతో 191 పరుగులు చేసిన కెఎస్ భరత్‌, ఈ సీజన్‌లో అవకాశాల కోసం డగౌట్‌లో కూర్చొని ఎదురుచూడాల్సి వచ్చింది...

srikar bharat

69 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన శ్రీకర్ భరత్, 37.58 సగటుతో 3909 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెఎస్ భరత్ అత్యధిక స్కోరు 308 పరుగులు...

click me!