నా దృష్టిలో అతనే బెస్ట్ కెప్టెన్, ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉండేవాడు... ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్..

First Published Jun 24, 2022, 11:40 AM IST

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్నాడు ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతికొద్ది మంది ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేసిన ప్యాట్ కమ్మిన్స్, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్నాడు...
 

2014 సీజన్‌లో కేకేఆర్ తరుపున ఎంట్రీ ఇచ్చిన ప్యాట్ కమ్మిన్స్, గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్ (2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్), దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్ వంటి కెప్టెన్ల తరుపున ఆడాడు...

Image Credit: Pat Cummins Instagram

2020 ఐపీఎల్ వేలంలో రూ.15.50 కోట్లకు ప్యాట్ కమ్మిన్స్‌ని కొనుగోలు చేసింది కేకేఆర్. అప్పటివరకూ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్. 2021లో క్రిస్ మోరిస్‌ రూ.16.25 కోట్లు దక్కించుకుని, వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

‘నాకు ఐపీఎల్‌లో ఫెవరెట్ మూమెంట్ అంటే 2014 సీజన్... ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్‌లో నేను సభ్యుడిగా ఉన్నా. ఫైనల్ మ్యాచ్ తర్వాతి రోజు కోల్‌కత్తా వీధుల్లో లక్షల మంది జనాల మధ్య సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను...

గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. గౌతీ ఎప్పుడూ క్రీజ్‌లో అగ్రెసివ్‌గా ఉండేవాడు. అతనిలో ఆ లక్షణమే నాకు బాగా నచ్చింది. కెప్టెన్ అంటే అలాగే ఉండాలనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్..

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ప్యాట్ కమ్మిన్స్, సారథిగా ఆడిన మొదటి యాషెస్ సిరీస్‌లోనే ఇంగ్లాండ్ జట్టును 4-0 తేడాతో చిత్తు చేసి, టోర్నీని కైవసం చేసుకున్నాడు...

click me!