అతని వికెట్ తీయడానికే వచ్చా... చెప్పి మరీ జో రూట్‌ వికెట్ తీసిన సిరాజ్ మియ్యా...

Published : Jul 03, 2022, 03:41 PM IST

ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్ ఓ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. గత ఏడాది టెస్టుల్లో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన జో రూట్, కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మరింత జోరు చూపిస్తూ శతకాల మోత మోగించాడు... అయితే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు జో రూట్... 

PREV
16
అతని వికెట్ తీయడానికే వచ్చా... చెప్పి మరీ జో రూట్‌ వికెట్ తీసిన సిరాజ్ మియ్యా...
Joe Root

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 2 సెంచరీలు చేసి, టెస్టుల్లో 27 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు జో రూట్. జనవరి 2021లో కేవలం 17 సెంచరీలతో ఉన్న జో రూట్, ఈ ఏడాదిన్నరలో 10 శతకాలు నమోదు చేయడం విశేషం...

26

ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ రికార్డులను సమం చేసిన జో రూట్‌ని, టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో బోల్తా కొట్టించాడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్...

36

ఓల్లీ పోప్ అవుటైన తర్వాత 12 ఓవర్ల పాటు వికెట్ పడకుండా కాపాడారు జో రూట్, జానీ బెయిర్‌స్టో. 67 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన జో రూట్‌, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

46
Mohammed Siraj-Ronaldo

గత రెండు టెస్టుల్లో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మాత్రమే జో రూట్‌ని స్వదేశంలో, విదేశాల్లో అవుట్ చేసిన బౌలర్లుగా ఉన్నారు. జో రూట్ అవుటైన తర్వాత మహ్మద్ సిరాజ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి...

56
Joe Root

‘నేను ఇక్కడికి వచ్చింది జో రూట్ వికెట్ కోసం... అతన్ని టార్గెట్ చేస్తాను... ’ అంటూ ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్.. చెప్పినట్టే జో రూట్‌ని భారీ స్కోరు చేయకుండా అడ్డుకుని పెవిలియన్ చేర్చాడు సిరాజ్ మియ్యా...

66

కేవలం 13 టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న మహ్మద్ సిరాజ్... ఇప్పటికే ప్రస్తుత తరంలో బెస్ట్ బ్యాటర్లుగా పేరొందిన జో రూట్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్‌లను రెండేసి సార్లు అవుట్ చేయడం విశేషం. వీరితో పాటు స్టీవ్ స్మిత్,రాస్ టేలర్‌ వికెట్లను కూడా పడగొట్టాడు సిరాజ్... 

click me!

Recommended Stories