టెస్టుల్లో ఇంకా ఫామ్‌ అందుకోని విరాట్... బంగ్లా టూర్ తర్వాత మరింత దిగజారిన కోహ్లీ యావరేజ్...

First Published Dec 24, 2022, 5:14 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ ముందు వరకూ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి, టీమ్‌లో అతని ప్లేస్‌ గురించి విపరీతమైన చర్చ జరిగింది. అయితే విమర్శలు చేసిన వారందరికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ చేసిన విరాట్, బంగ్లా టూర్‌లో వన్డే సెంచరీ అందుకున్నాడు...

Virat Kohli

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ కెరీర్‌లో 44వ వన్డే సెంచరీ అందుకున్నాడు. ఇదే ఊపులో టెస్టుల్లో కూడా సెంచరీ చేస్తాడని అనుకున్నారు అభిమానులు. అయితే అలా జరగలేదు...

virat kohli

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 బంతులాడి 1 పరుగుకి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తరుపున అత్యల్ప స్కోరు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీయే. సిరాజ్ 4 పరుగులు చేసి విరాట్ తర్వాత సింగిల్ డిజిట్ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు...

Image credit: Getty

రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చాడు విరాట్ కోహ్లీ..

Image credit: Getty

22 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ... మెహిదీ హసన్ బౌలింగ్‌లో మోమినుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు...

బంగ్లా టూర్‌లో ఫెయిల్యూర్‌తో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48.90కి పడిపోయింది. 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా విరాట్ కోహ్లీ టెస్టు సగటు 49 కంటే తక్కువకి పడిపోయింది.2020లో న్యూజిలాండ్ పర్యటనలో 38 పరుగులు చేసి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, ఈసారి 45 పరుగులు చేసి... చెత్త రికార్డు నెలకొల్పాడు...

2020 ఏడాదిలో కరోనా కారణంగా టీమిండియా నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. ఆ ఏడాది విరాట్ టెస్టు సగటు 19.33 ఉండగా, గత ఏడాది కాస్త పెరిగి 28.21గా నమోదైంది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ టెస్టు సగటు మళ్లీ పడిపోయింది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ 26.50 సగటుతో టెస్టుల్లో పరుగులు చేశాడు...

Kohli

టెస్టుల్లో బ్యాటర్‌నే కాకుండా ఫీల్డర్‌గానూ ఫెయిల్ అయ్యాడు విరాట్ కోహ్లీ. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 3 క్యాచులను జారవిడిచాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ మిస్ చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో విరాట్‌కి ఏదీ కలిసిరాలేదు...

click me!