రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టుకు బలం. భారత టాప్-ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్, కోహ్లీతో తగినంత అనుభవం ఉంది. వీళ్లిద్దరూ బాగా ఆడితే తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
అలాగే, భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలతో ఇతర జట్లతో పోలిస్తే ఎక్కువ మంది ఆల్ రౌండర్లు భారత జట్టులో ఉన్నారు. వీరిలో ముగ్గురు కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలగడం టీమిండియాకు పెద్ద బలం.
భారత జట్టులో మంచి స్పిన్ బౌలర్లు కూడా ఉన్నారు. దుబాయ్ పిచ్‌పై స్పిన్ బాగా తిరుగుతుంది. జట్టులో వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. అనుభవమున్న జడేజా, అక్షర్ పటేల్ ఎప్పుడైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. దీంతో పాటు కుల్దీప్ యాదవ్ దుబాయ్‌లో ఇదివరకే బాగా ఆడాడు. దీనివల్ల స్పిన్ బౌలింగ్‌లో ఇండియా మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది.