విరాట్ కోహ్లీ ఖాతాలో మొట్టమొదటి 10... కలిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న జడ్డూ, అశ్విన్..

Published : Mar 13, 2023, 05:09 PM IST

ఎన్నో అంచనాలు, మరెన్నో లెక్కలతో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయాలు అందుకోగా మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా కమ్‌బ్యాక్ ఇచ్చింది. నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు...

PREV
16
విరాట్ కోహ్లీ ఖాతాలో మొట్టమొదటి 10... కలిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న జడ్డూ, అశ్విన్..

2016-17 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా, గత రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియాని, ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో ఓడించి సిరీస్ గెలిచింది. తాజాగా మరోసారి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా... 

26

అహ్మదాబాద్ టెస్టులో కేవలం 21 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు కోల్పోగా, శ్రేయాస్ అయ్యర్ రిటైర్డ్ హర్ట్ కావడంతో టీమిండియా తరుపున 9 వికెట్లే పడ్డాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయింది...  గత 12 ఏళ్లలో ఇండియాలో ఇన్ని తక్కువ వికెట్లు పడడం ఇదే తొలిసారి...

36
Image credit: Getty

2013 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 29 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. 2017 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. 2023లో ఈ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నారు...

46

2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవీంద్ర జడేజా 22 వికెట్లు తీయడంతో పాటు 135 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 25 వికెట్లు తీసి, 86 పరుగులు చేశాడు... 

56
Image credit: PTI

అహ్మదాబాద్ టెస్టులో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 10వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మూడు ఫార్మాట్లలోనూ 10కి పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

66
Image credit: PTI

వన్డేల్లో 38 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 15 సార్లు ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో 10వ సారి ఈ ఫీట్ సాధించి, టాప్‌లో నిలిచాడు..
 

Read more Photos on
click me!

Recommended Stories