బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన అక్షర్ పటేల్... సిరీస్‌లో తీసింది మూడే వికెట్లు అయినా...

Published : Mar 13, 2023, 03:02 PM IST

పెళ్లి పీటల నుంచి నేరుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీకి వచ్చిన ఇద్దరు భారత ప్లేయర్లలో అక్షర్ పటేల్ ఒకడు. బాలీవుడ్ నటి అథియా శెట్టిని పెళ్లాడిన కెఎల్ రాహుల్, మ్యారేజ్ అయ్యాక మూడు రోజులకే బీసీసీఐ క్యాంపులో చేరాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి...

PREV
17
బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన అక్షర్ పటేల్... సిరీస్‌లో తీసింది మూడే వికెట్లు అయినా...

తన లాంగ్‌టైం గర్ల్‌ఫ్రెండ్ మెహా పటేల్‌ని జనవరి 27న వివాహం చేసుకున్నాడు అక్షర్ పటేల్. పెళ్లైన తర్వాత కెఎల్ రాహుల్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన మొదటి రెండు టెస్టుల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫలితంగా వైస్ కెప్టెన్సీ కోల్పోయి, మూడో టెస్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే అక్షర్ పటేల్ మాత్రం టీమిండియాకి స్టార్ పర్ఫామర్‌గా మారాడు...

27
Image credit: PTI

టాపార్డర్ బ్యాటర్లు ఫెయిలైన నాగ్‌పూర్‌లో బ్యాటుతో 84 పరుగులు చేసిన అక్షర్ పటేల్, ఢిల్లీ టెస్టులో 74 పరుగులు చేశాడు. అహ్మదాబాద్ టెస్టులో 113 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి, విరాట్ కోహ్లీతో కలిసి ఆరో వికెట్‌కి 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు...

37
Image credit: PTI

బ్యాటుతో అదరగొడుతూ 4 టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 264 పరుగులు చేసిన అక్షర్ పటేల్, 88 సగటుతో అదరగొట్టాడు. ఇందులో 9 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ అక్షర్ పటేల్...

47

బౌలింగ్‌లో మాత్రం అక్షర్ పటేల్‌ని పెద్దగా వాడుకోలేదు రోహిత్ శర్మ. అశ్విన్, ఈ సిరీస్‌లో 1000 బంతులకు పైగా బౌలింగ్ చేస్తే, జడేజా కూడా 950కి పైగా బంతులు బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ మాత్రం అందులో సగం మాత్రమే వేశాడు...

57

మొతేరా స్టేడియంలో రెండు టెస్టులాడి 21 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు వేసి ఒకే ఒక్క వికెట్ తీశాడు. 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అక్షర్  పటేల్, రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీని దూరం చేశాడు...

67

163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్‌తో టెస్టు కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు అక్షర్ పటేల్.. 

77
Image credit: PTI

బంతుల వారీగా అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ 2205 బంతుల్లో 50 వికెట్లు తీయగా జస్ప్రిత్ బుమ్రా 2465 బంతుల్లో, కర్సన్ గార్వీ 2534 బంతుల్లో, రవిచంద్రన్ అశ్విన్ 2597 బంతుల్లో 50 వికెట్లు అందుకున్నారు..
 

click me!

Recommended Stories