ఐదుగురు కెప్టెన్లు, 10 విజయాలు... టీమిండియా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ క్రెడిట్ ఎవరికి దక్కాలి!...

Published : Mar 13, 2023, 01:08 PM IST

టీమిండియా వరుసగా రెండో సీజన్‌లోనూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. గత సీజన్‌లో న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడి ఓడిన భారత జట్టు, ఈసారి ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే గత సీజన్‌తో పోలిస్తే, ఈ సారి టీమిండియా ఫైనల్ ప్రయాణం చిత్రంగా సాగింది..

PREV
114
ఐదుగురు కెప్టెన్లు, 10 విజయాలు... టీమిండియా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ క్రెడిట్ ఎవరికి దక్కాలి!...
Image credit: PTI

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ల మధ్య టీమిండియా ఏకంగా ఐదుగురు కెప్టెన్లను మార్చింది. 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ ఆడింది టీమిండియా...

214

నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఈజీగా గెలిచేది. అయితే వర్షం కారణంగా ఐదో రోజు ఆట రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా... ఆ తర్వాత లీడ్స్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది ఇంగ్లాండ్...

314

ఓవల్‌లో జరిగిన ఇండియా- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో భారత జట్టు 157 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడింది... ఈ సిరీస్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
 

414
Rahane-Ravi Shastri

టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడింది టీమిండియా. విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో తొలి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆఖరి రోజు ఆఖరి సెషన్‌లో ఆఖరి వికెట్ తీయడంతో తొలి టెస్టును డ్రాగా ముగించింది భారత జట్టు...

514

రెండో టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, వాంఖడే టెస్టుకి కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ని 62 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు, 372 పరుగుల తేడాతో టెస్టుల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది.. ఈ సిరీస్ విజయంతో టీమిండియా ఖాతాలో 12 పాయింట్లు చేరాయి...

614

2021 చివర్లో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లింది టీమిండియా. సెంచూరియన్ టెస్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత జట్టు. అయితే కోహ్లీ గాయంతో తప్పుకోవడంతో రెండో టెస్టుకి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. రాహుల్ కెప్టెన్సీలో జోహన్‌బర్గ్‌లో తొలి ఓటమి చవి చూసింది టీమిండియా...

714

కేప్‌టౌన్‌ టెస్టులో తిరిగి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, టీమిండియాకి విజయాన్ని అందించలేకపోయాడు. కేప్ టౌన్ టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు...

814

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడింది భారత జట్టు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, రెండో టెస్టులో 238 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది...

914
Image credit: Getty

మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు వాయిదా పడి, 2022 జూలైలో జరిగింది. అయితే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ గాయపడడంతో ఈ టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడింది.. 

1014
India vs Bangladesh

డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్లిన టీమిండియా, రెండు టెస్టులు ఆడి 2-0 తేడాతో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు, రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ రెండు టెస్టులకి కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు...

1114

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా, మూడో టెస్టులో ఆసీస్ చేతుల్లో ఓడింది. ఆఖరి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

1214

మొత్తానికి 2021 జూలై నుంచి 2023 మార్చి వరకూ టీమిండియాని టెస్టుల్లో ఐదుగురు కెప్టెన్లు నడిపించగా 10 విజయాలు దక్కాయి. ఇందులో 4 విజయాలు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దక్కగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో 4 విజయాలు దక్కాయి. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో రెండు విజయాలు దక్కాయి. రోహిత్ కెప్టెన్సీలో గెలిచిన టెస్టులన్నీ స్వదేశంలోనే జరగడం విశేషం..

1314
Virat Kohli-Rohit Sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో 3 విజయాలు అందుకున్న భారత జట్టు, రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌లో రెండు టెస్టు విజయాలు అందుకుంది. ఇప్పటిదాకా విదేశాల్లో టెస్టుకి కెప్టెన్సీ చేయని రోహిత్ శర్మ, మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనే టీమ్‌ని నడిపించబోతున్నాడు (అప్పటిదాకా రోహిత్ ఫిట్‌గా ఉంటే...)..

1414

టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వెళ్లిన క్రెడిట్ రోహిత్ శర్మ కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌లకే దక్కాలి. అలాగే తొలి టెస్టులో శ్రీలంకను ఓడించి, టీమిండియాకి లైన్ క్లియర్ చేసిన న్యూజిలాండ్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే... 

Read more Photos on
click me!

Recommended Stories