20 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో ఇండియా - ఆస్ట్రేలియా.. అప్పటికీ ఇప్పటికీ ఇన్ని పోలికలా...

First Published | Nov 18, 2023, 1:00 PM IST

2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఎలాంటి అంచనాలు లేకుండా మొదలెట్టి, ఫైనల్ చేరింది భారత జట్టు. 2023 టోర్నీలో భారీ అంచనాలను అందుకుంటూ అజేయంగా ఫైనల్‌కి దూసుకెళ్లింది..
 

India vs Australia

2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియా- ఆస్ట్రేలియా, వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో తలబడడం ఇదే తొలిసారి...  ఆస్ట్రేలియా 2007, 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ ఆడి టైటిల్ గెలవగా భారత జట్టు 2011లో టైటిల్ గెలిచింది. 

2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా- ఆస్ట్రేలియాని క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడించింది. ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, సెమీస్‌లో భారత జట్టును చిత్తు చేసింది.. 
 


2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాయి. 2003 వరల్డ్ కప్‌కి, 2023 వరల్డ్ కప్‌కీ ఎన్నో విషయాల్లో పోలికలు ఉండడం విశేషం..

2003 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌కి చేరింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్ చేరింది..
 

2003 వన్డే వరల్డ్ కప్ లీగ్ స్టేజీలో ఆస్ట్రేలియా, టీమిండియాని ఓడించింది. 2023 వన్డే వరల్డ్ కప్ లీగ్ స్టేజీలో భారత జట్టు, ఆస్ట్రేలియాని ఓడించింది..

2003 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు, ఆసీస్‌తో ఓటమి తర్వాత వరుసగా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా కూడా వరుసగా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరింది..

2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేసి అప్పటిదాకా ఉన్న రికార్డులు బ్రేక్ చేయగా, 20 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేసి 700+ క్లబ్‌ని క్రియేట్ చేశాడు.. 

Latest Videos

click me!