ఆస్ట్రేలియాతో అంత ఈజీ కాదు! కాస్త ఆదమరిస్తే... ఆరో టైటిల్ కొట్టేసి వెళ్లిపోతారు...

First Published | Nov 18, 2023, 11:36 AM IST

క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌ ఆస్ట్రేలియా. 1987 నుంచి 2019 మధ్య ఐదు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. 1999, 2003, 2007 వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది ఆసీస్.. 2011లో మిస్ అయినా 2015లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2019లో ఫైనల్ రాలేకపోయినా 2023లో ఫైనల్‌కి దూసుకొచ్చింది. 

2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీని రెండు వరుస పరాజయాలతో మొదలెట్టింది ఆస్ట్రేలియా. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆసీస్ పనైపోయిందని అంతా అనుకున్నారు...

ICC Cricket World Cup 2023

అయితే ఆస్ట్రేలియా ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. వరుసగా 7 విజయాలతో సెమీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, సెమీస్‌లో సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది..


India vs Australia

2015 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు గ్రూప్ స్టేజీలో ఆరుకి ఆరు విజయాలు అందుకుని సెమీస్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతుల్లో 95 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో ఆడిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ ఇప్పటికీ ఆస్ట్రేలియా జట్టులో సభ్యులుగా ఉన్నారు..

Australia

భారత జట్టు తరుపున 2015 సెమీస్ ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతున్నారు...
 

ఆస్ట్రేలియాకి ఎక్కడ ఆడుతున్నాం? ఎవరితో ఆడుతున్నాం? అనే విషయాలు ఏ మాత్రం లెక్క కాదు! ప్రత్యర్థి ఎవ్వరైనా, ఆడేది ఎక్కడైనా, పిచ్ ఎలాంటిదైనా చెలరేగిపోవడం, నూటికి 200 శాతం పర్ఫామెన్స్ చూపించడం ఆస్ట్రేలియాకి బాగా అలవాటు..

Australia Win

సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ని గమనిస్తే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో చేసిన మెరుపులు కనిపిస్తాయి. ఆస్ట్రేలియాకి, సౌతాఫ్రికాకి ఫీల్డింగ్ ఒక్కటే తేడా. ఆసీస్ అసలు అవకాశం లేని బంతులను కూడా క్యాచ్‌లుగా మలిస్తే, చేతుల్లో పడిన క్యాచులను అందుకోలేకపోయింది సౌతాఫ్రికా... 

మరీ ముఖ్యంగా ప్రెషర్ మేనేజ్‌మెంట్‌లో ఆస్ట్రేలియా టీమ్ టాప్‌లో ఉంటుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్... ఏ టీమ్ కూడా ఆసీస్‌తో పోటీకి రాలేదు.. 

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 91 పరుగులకే 7 వికెట్లు పడిన తర్వాత కూడా 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది ఆస్ట్రేలియా... ఆ ప్లేస్‌లో ఏ టీమ్ ఉన్నా ఇది సాధ్యమయ్యేది కాదు..

కాబట్టి ఆసీస్‌ని ఓడించాలంటే మ్యాచ్ రిజల్ట్ వచ్చే వరకూ రిలాక్స్ అవ్వకూడదు. వెంటవెంటనే 2-3 వికెట్లు పడ్డాయని సంతోషపడినా, టాపార్డర్‌ని తక్కువ స్కోరుకే అవుట్ చేశామని ఆనందం పడినా, విజయానికి దగ్గరగా వచ్చేశామని రిలాక్స్ అయినా అవకాశం చేజారిపోవచ్చు, ఆస్ట్రేలియా చేతుల్లోకి ఆరో టైటిల్ వెళ్లిపోవచ్చు.. 

గెలవడం కోసం ఛీటింగ్ చేయడం కూడా తప్పు కాదని బలంగా నమ్ముతుంది ఆసీస్. అలాగే విజయం కోసం కాళ్లు చేతులు విరగ్గొట్టుకోవడానికి, ఆటలో ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండే మొండి పట్టుదల ఆసీస్ సొంతం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని టీమిండియా ఫైనల్‌కి ప్రిపేర్ అవ్వాలని హెచ్చరిస్తున్నారు కొందరు విశ్లేషకులు.. 

Latest Videos

click me!