India vs Australia: భారత్-ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
IND vs AUS Champions Trophy Semi Final Live: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ 264 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మరో మైలురాయిని అందుకున్నాడు.
25
Rohit Sharma Out
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
265 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చిన వెంటనే చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. 28 పరుగుల ఇన్నింగ్స్ ల తర్వాత గేల్ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు.
35
Image Credit: Getty Images
ఐసీసీ టోర్నమెంట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా రోహిత్ శర్మ
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు 265 పరుగుల టార్గెట్ ను ఉంచింది. రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆడటం మొదలుపెట్టాడు. అయితే, కొద్దిసేపు క్రీజులో ఉన్న రోహిత్ 28 పరుగుల ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు. ఈ ఒక్క సిక్సర్ తో ఐసీసీ టోర్నమెంట్ లో రోహిత్ బాదిన సిక్సర్ల సంఖ్య 65కు చేరుకుంది. దీంతో అంతకుముందు క్రిస్ గేల్ కొట్టిన 64 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
45
Image Credit: Getty Images
అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్-1 గా రోహిత్ శర్మ
అలాగే, అంతర్జాతీ క్రికెట్ లో సిక్సర్ల రారాజుగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. సిక్సర్ల పరంగా రోహిత్ శర్మకు సరితూగే ప్లేయర్ ఇప్పుడు ఎవరూ లేరనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్ల పరంగా రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 633 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును సాధించాడు.
55
Rohit Sharma. (Photo- BCCI X/@BCCI)
అయితే, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిది రికార్డు కు దగ్గరలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది తన మొత్తం వన్డే కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ ఇప్పటివరకు 341 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డును త్వరలోనే రోహిత్ శర్మ అందుకునే ఛాన్స్ ఉంది.