India vs Australia Champions Trophy 2025 Semi-Final: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి ODI మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేస్తోంది.
ఇరు జట్లు ఇవే
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (wk), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.