ఢిల్లీ టెస్టు విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా! లంక వైపు ఆస్ట్రేలియా చూపు...

Published : Feb 19, 2023, 02:26 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు టెస్టు క్రికెట్ ఫ్యాన్స్. టెస్టుల్లో నెం.1 టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియా, నెం.2 ఇండియా మధ్య హోరాహోరీ ఫైట్ చూడవచ్చని అనుకున్నారు. అయితే స్వదేశంలో చిరుతపులుల్లా చెలరేగే భారత జట్టు, ఆసీస్‌ని మొదట రెండు టెస్టుల్లోనూ చిత్తు చేసింది...  

PREV
17
ఢిల్లీ టెస్టు విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా! లంక వైపు ఆస్ట్రేలియా చూపు...
Image credit: PTI

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, ఢిల్లీ టెస్టులో కాస్త పర్వాలేదనిపించింది. రెండో రోజు ఆఖరి సెషన్‌లో దూకుడుగా ఆడి 12 ఓవర్లలో 61 పరుగులు రాబట్టింది...
 

27
Smith Kohli

రెండో రోజు ఆఖరి సెషన్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్, ఢిల్లీ టెస్టులో ఆసీస్‌ డామినేషన్ ఉంటుందని అనుకున్నారు. అయితే మూడో రోజు తొలి సెషన్‌లో సీన్ రివర్స్ అయిపోయింది. మూడో రోజు 45 నిమిషాలు బ్యాటింగ్ చేసి 52 పరుగులు జత చేసి మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

37
Image credit: PTI

115 పరుగుల టార్గెట్‌ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమిండియా, సిరీస్‌ని 2-0 తేడాతో నిలుపుకుంది. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది టీమిండియా. అయితే మిగిలిన టెస్టుల్లో రిజల్ట్ తేడా కొట్టకుండా చూసుకుంటే సరిపోతుంది...

47
Image credit: PTI

టీమిండియా, మిగిలిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాని ఓడిస్తే... ఆసీస్‌ ఫైనల్ ఛాన్సులు లంకపై ఆధారపడతాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలు అందుకున్న భారత జట్టు, దక్షిణాఫ్రికా ఫైనల్ ఛాన్సులపై నీళ్లు చల్లింది...
 

57

ఈ నెల చివర్లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది సౌతాఫ్రికా. ఆ రెండు టెస్టులు నెగ్గినా సౌతాఫ్రికా ఫైనల్ చేరేందుకు పర్సెంటేజ్ సరిపోదు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో శ్రీలంక, త్వరలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది..

67
Image credit: Getty

ఈ టెస్టు సిరీస్‌ని 2-0 తేడాతో గెలిస్తే, టీమిండియాతో కలిసి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే ఛాన్స్ దక్కించుకుంటుంది శ్రీలంక. కొన్ని దశాబ్దాలుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లంక క్రికెట్‌ టీమ్‌కి ఈ రెండు విజయాలు చాలా అవసరం...

77

న్యూజిలాండ్ ఒక్క టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా... ఇండియాతో కలిసి ఫైనల్ ఆడుతుంది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్‌, శ్రీలంకలపై ఆధారపడకూడదంటే మిగిలిన రెండు టెస్టుల్లో కనీసం ఒక్క మ్యాచ్‌ని అయినా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఆస్ట్రేలియా...

click me!

Recommended Stories