ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ అవ్వడం కష్టమే.. మాథ్యూ హేడెన్ కామెంట్...

First Published Feb 19, 2023, 1:06 PM IST

ఐపీఎల్‌ పుట్టినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2022 సీజన్‌కి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాహీ, 8 మ్యాచులు ముగిసిన తర్వాత మళ్లీ సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023 సీజన్‌, ధోనీకి ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌...
 

2020 ఐపీఎల్‌కి ముందే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2020 నుంచి మాహీ, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోబోతున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ప్రతీసారీ తాను వచ్చే సీజన్ ఆడబోతున్నానంటూ చెప్పుకుంటూ వచ్చిన ధోనీ, 2023 సీజన్ తనకి ఆఖరిదని స్వయంగా ప్రకటించాడు..

Image credit: PTI

కరోనా కారణంగా 2019 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, సొంత నగరం చెన్నైలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2020 పూర్తిగా యూఏఈలో జరగగా, 2021 సీజన్ సగం ముంబైలో, మిగిలిన సగం యూఏఈలో జరిగింది. 2022 సీజన్ కూడా కొన్ని నగరాలకే పరిమితమైంది..
 

Latest Videos


2023 సీజన్ పూర్తిగా 12 నగరాల్లో పాత పద్ధతిలో హోం, Away వెన్యూల్లో జరగనుంది. చెపాక్ మైదానంలో సొంత అభిమానుల మధ్య ఆఖరి ఐపీఎల్ సీజన్ ఆడి, తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..

‘సీఎస్‌కేకి, ధోనీకి ఇది చిరస్మరణీయ సీజన్. గత ఏడాది ధోనీ మళ్లీ వస్తాడని అనుకున్నాం, కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదు. ధోనీ స్వయంగా ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఎల్లో ఆర్మీ, చెన్నై... 15 సీజన్లుగా టీమ్‌ని నడిపించిన తమ సూపర్ లీడర్‌ని మిస్ అవుతారు...

Dhoni IPL Trophy

నాకు తెలిసి ఇది ధోనీ ఐపీఎల్ కెరీర్‌కి ముగింపు. ఆఖరి సీజన్‌లో ధోనీ తన పర్ఫామెన్స్‌తో చెన్నైకి విజయాలు అందించాలి. అభిమానులను తన షాట్స్‌తో అలరించాలి. నేను ఎన్నో ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో పాల్గొన్నా... నేను చూసిన బెస్ట్ కెప్టెన్లలో ఒకడు..

నా ఉద్దేశంలో ధోనీ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ అవ్వడం కష్టమే. ఎందుకంటే సీఎస్‌కే సీనియర్ ప్లేయర్లు ఎక్కువ. వాళ్లను ఎలా వాడాలో ధోనీకి బాగా తెలుసు. అలాంటి టీమ్‌ని నడిపించడం అంత తేలికైన విషయం కాదు. జడ్డూ విషయంలో ఏం జరిగిందో చూశాం కదా..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్..
 

click me!