టీ20 వరల్డ్‌కప్ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకి భారత జట్టు... పూర్తి షెడ్యూల్ ఇదే...

First Published Sep 10, 2021, 4:39 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అనివార్య కారణాలతో రద్దు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌పైకి మళ్లింది... ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వెళ్లే టీమిండియా సభ్యులు, ఆ తర్వాత అక్కడ టీ20 వరల్డ్‌కప్ ఆడనున్నారు... ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు...

Team India

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టెస్టులు, నాలుగు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడనుంది... డిసెంబర్ 17, 2021 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్... జనవరి 26 వరకూ జరగుతుంది. 

డిసెంబర్ 17న జోహన్‌బర్గ్‌లో తొలి టెస్టు ఆడే టీమిండియా, ఆ తర్వాత డిసెంబర్ 26న సెంచూరియన్‌లో రెండో టెస్టు ఆడుతుంది...

మళ్లీ 2022, జనవరి 3 నుంచి జోహన్‌బర్గ్‌లోనూ ఇండియా, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది... ఈ టెస్టు మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి...

2022, జనవరి 11న పార్ల్‌లో తొలి వన్డే ఆడే భారత జట్టు, జనవరి 14న కేప్‌టౌన్‌లో రెండో వన్డే, అదే స్టేడియంలో జనవరి 16న మూడో వన్డే ఆడుతుంది... వన్డే మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి...

ఆ తర్వాత జనవరి 19న కేప్‌టౌన్‌లో మొదటి టీ20 మ్యాచ్ ఆడే భారత జట్టు, జనవరి 21న అదే స్టేడియంలో రెండో టీ20 ఆడుతుంది...

జనవరి 23న పార్ల్‌లో మూడో టీ20 మ్యాచ్ ఆడే టీమిండియా, అదే స్టేడియంలో జనవరి 26న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడుతుంది. టీ20 మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతాయి...

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా, ఇప్పటివరకూ సౌతాఫ్రికా పర్యటనలో మాత్రం టెస్టు సిరీస్‌ విజయం అందుకోలేకపోయింది...

ఇప్పటిదాకా దక్షిణాఫ్రికా పర్యటనలో 17 టెస్టు మ్యాచులు ఆడిన భారత జట్టు, కేవలం రెండే టెస్టుల్లో విజయం సాధించింది.. భారత జట్టు విదేశాల్లో టెస్టు సిరీస్ విజయాలు అందుకోని ఒకే ఒక్క దేశం సౌతాఫ్రికానే...

2018 పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆ పర్యటనలో ఆఖరి టెస్టు మాత్రమే గెలిచి, నిరాశగా వెనుదిరిగింది విరాట్ సేన...

ఆ తర్వాత 2019లో స్వదేశంలో సౌతాఫ్రికాను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసినా వారిని వారి గడ్డపైనే ఓడించి, చరిత్ర క్రియేట్ చేసే సువర్ణావకాశం టీమిండియా ముందుంది...

ఇప్పుడు సౌతాఫ్రికా జట్టు ప్రదర్శన ఏ మాత్రం మెరుగ్గా లేకపోవడంతో భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే నాలుగు నెలల తర్వాత జరిగే ఈ టెస్టు సిరీస్ సమయానికి పరిస్థితులు తారుమారు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!