ఐదో టెస్టు ఆడేందుకు భయపడిన భారత ప్లేయర్లు... ఆ కారణంగానే ఆఖరి నిమిషాల్లో రద్దు నిర్ణయం...

First Published Sep 10, 2021, 3:34 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో రద్దైన విషయం తెలిసిందే. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఈ టెస్టు మ్యాచ్ రద్దైనట్టు వార్తలు వినిపించాయి... అయితే అసలు నిజం వేరే ఉందట...

నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడ్డారు...

వీరు ఐసోలేషన్‌లో గడుపుతున్న సమయంలో తాజాగా అసిస్టెంట్ ఫిజియో యోగేవ్ పర్మర్‌కి కూడా పాజిటివ్ రావడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొనలేకపోయింది...

ఐదో టెస్టు ఆరంభానికి ముందురోజు భారత క్రికెటర్లకు రెండు విడతల కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో క్రికెటర్లందరికీ నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఐదో టెస్టు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగుతుందని భావించారంతా...

అయితే ఐదో టెస్టు ప్రారంభానికి ముందు కొందరు క్రికెటర్లు, కరోనా భయంతో బరిలో దిగడానికి అంగీకరించలేదట... ఇప్పటికే భారత జట్టులోని నలుగురికి కరోనా సోకడంతో భయంతో మ్యాచ్ ఆడడానికి ఇష్టపడలేదు...

ఇలా భయపడి, మ్యాచ్ ఆడడానికి ఇష్టపడని ప్లేయర్లలో రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా వంటి కీ ప్లేయర్లు ఉండడంతో ఏం చేయాలో తెలియక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది...

ఆటగాళ్ల భద్రత దృష్ట్యా, వారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిన భారత క్రికెట్ బోర్డు, ఇంగ్లాండ్ బోర్డుతో చర్చలు జరిపి... మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు...

ఇంగ్లాండ్, ఇండయా మధ్య ఐదో టెస్టును రీ షెడ్యూల్ చేసే బాధ్యత ఈసీబీకే అప్పగించింది బీసీసీఐ.  భారత క్రికెటర్ల నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ప్రశంసలు కురిపించాడు...

‘భారత జట్టు కొన్ని నెలలుగా బయో బబుల్ జీవితం గడుపుతోంది. వారిలో తీవ్రమైన అసహనం, కోపం ఉండొచ్చు. అయితే వాళ్లు ధైర్యం చేసి, ఆడలేమని చెప్పేశారు...
ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇది ఐపీఎల్ కోసం కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్లు మరింత కఠినమైన బయో బబుల్‌లో గడపాల్సి ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు నాజర్ హుస్సేన్.

click me!