అప్పుడు, ఇప్పుడు ఆ ఇద్దరే... ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, జో రూట్...

Published : Sep 10, 2021, 04:18 PM IST

హోరాహోరీగా సాగిన ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి ఊహించని ముగింపు ఇచ్చింది కరోనా. అన్యూహ్యంగా ఐదో టెస్టు రద్దు కావడంతో భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది... అయితే ఈ ఏడాది భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు, ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటించినప్పుడు ఇద్దరూ మాత్రం ఒకేలా ప్రదర్శన ఇవ్వడం విశేషం...

PREV
19
అప్పుడు, ఇప్పుడు ఆ ఇద్దరే... ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, జో రూట్...

Joe Root

ఇంగ్లాండ్‌, భారత్‌లో పర్యటించిన సమయంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా జో రూట్ టాప్‌లో నిలిచాడు... 

29

మొదటి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన జో రూట్, ఆ తర్వాత భారత స్పిన్ పిచ్‌లపై నిలదొక్కుకోలేక తెగ ఇబ్బంది పడ్డాడు... అయినా ఇంగ్లాండ్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

39

చెన్నై టెస్టులో భారత జట్టు తరుపున 160 పరుగులతో రాణించిన రోహిత్ శర్మ, టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

49

ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది... ఇంగ్లాండ్ తరుపున మూడు సెంచరీలు చేసిన జో రూట్... సిరీస్‌లో 564 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

59

నాలుగో టెస్టులో విదేశాల్లో మొట్టమొదటి సెంచరీ చేసిన భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, సిరీస్‌‌లో 368 పరుగులతో భారత జట్టు తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

69
Joe Root

సిరీస్‌లో జో రూట్ నాలుగుసార్లు 50+ స్కోర్లు (మూడు సెంచరీలు) నమోదుచేయగా, భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా నాలుగు 50+ (ఓ సెంచరీ) స్కోర్లు నమోదుచేశాడు...

79

టెస్టు సిరీస్‌లో జో రూట్ ఏకంగా 69 ఫోర్లతో టాప్‌లో ఉండగా, టీమిండియా తరుపున 42 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు...

89
Shardul Thakur

సిక్సర్ల విషయంలో మాత్రం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ టాప్‌లో ఉండడం విశేషం. రెండు టెస్టులు ఆడిన శార్దూల్ ఠాకూర్ నాలుగు సిక్సర్లు బాదితే, నాలుగు టెస్టులు ఆడిన రోహిత్ కూడా నాలుగు సిక్సర్లతో సమంగా నిలిచాడు...

99

బౌలర్లలో ఇంగ్లాండ్ యంగ్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్ 4 మ్యాచుల్లో 21 వికెట్లు తీయగా, భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 18 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 15 వికెట్లు, సిరాజ్ 14 వికెట్లు తీశారు.

click me!

Recommended Stories