ఆ ముగ్గురూ అక్కడ పనికి రారా... అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చినా, సౌతాఫ్రికా టూర్‌లో...

First Published Dec 9, 2021, 11:50 AM IST

న్యూజిలాండ్‌‌తో స్వదేశంలో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు, ఈ నెలాఖరున దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో అక్షర్ పటేల్‌కి చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, నాలుగు టెస్టుల్లో ఐదు సార్లు ఐదేసి వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

ముంబై టెస్టులో మాత్రం అక్షర్ పటేల్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 3 మెయిడిన్లతో 2 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే కుప్పకూలడంలో తన వంతు పాత్ర పోషించాడు...

రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్‌కి ఒకే ఒక్క వికెట్ దక్కింది. మొత్తంగా రెండు టెస్టుల్లో 10 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులతో అజేయంగా నిలిచిన అక్షర్ పటేల్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేసి టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపులు మెరిపించిన అక్షర్ పటేల్ అజేయంగా నిలిచాడు...

అయినా అక్షర్ పటేల్‌కి సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో జయంత్ యాదవ్‌కి చోటు ఇచ్చిన సెలక్టర్లు, అక్షర్ పటేల్‌ను పట్టించుకోలేదు...

అక్షర్ పటేల్ ఇప్పటిదాకా ఆడిన ఐదు టెస్టులు కూడా స్వదేశంలో ఆడినవే. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు ఆడిన అక్షర్, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడాడు. ఇక్కడ రాణిస్తున్న అక్షర్ పటేల్, విదేశాల్లో పనికి రాడని సెలక్టర్లు భావిస్తున్నారా? అని ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. 

అలాగే ఇంగ్లాండ్ టూర్‌కి, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఒక్క అవకాశం కూడా దక్కించుకోకుండానే టెస్టు టీమ్‌కి దూరమయ్యాడు...

తొలి టెస్టులో వృద్ధిమాన్ సాహా మెడనొప్పితో వికెట్ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో వచ్చిన తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, వికెట్ల వెనకాల మెరుపులా కదులుతూ ఆకట్టుకున్నాడు...

అయితే రిషబ్ పంత్ రీఎంట్రీతో వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా ఎంచుకున్న సెలక్టర్లు, శ్రీకర్ భరత్‌ను మళ్లీ అవసరం తీరగానే పక్కనబెట్టేశారు...

సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు, మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేకి సౌతాఫ్రికా టూర్‌లో మరో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, గాయం కారణంగా శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాలకు రెస్ట్ ఇచ్చారు...

అలాగే మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాల రీఎంట్రీతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను సఫారీ టూర్ నుంచి తప్పించారు. స్టాండ్ బై ప్లేయర్లుగా నవ్‌దీప్ సైనీ, సౌరబ్ కుమార్, దీపక్ చాహార్, అర్జాన్ నగ్వాస్‌వాలాకు చోటు ఇచ్చిన సెలక్టర్లు, న్యూజిలాండ్‌ సిరీస్‌కి ఎంపిక చేసిన ప్రసిద్ధ్ కృష్ణను పూర్తిగా పక్కనబెట్టేశారు. 

click me!