IND vs ENG: 224 పరుగులకు భార‌త్ ఆలౌట్.. బౌలర్ల పైనే భారం

Published : Aug 01, 2025, 05:19 PM IST

India vs England: ఇంగ్లాండ్‌తో 5వ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. భార‌త ప్లేయ‌ర్ల‌లో కరుణ్ నాయర్ ఒక్క‌రే హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. గుస్ అట్కిన్‌సన్, జోస్ టంగ్ భార‌త బ్యాటింగ్ ను దెబ్బ‌కొట్టారు.

PREV
15
5వ టెస్ట్ రెండో రోజు కుప్ప‌కూలిన భారత్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత్ రెండో రోజు ఆటలో పూర్తిగా పతనమయ్యింది. ఓవ‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 64 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయింది. 

కరుణ్ నాయర్ ఒక్కరే హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ను ఆడాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు గస్ అట్కిన్‌సన్, జోష్ టంగ్‌ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా దెబ్బ‌కొట్టారు.

DID YOU KNOW ?
టెస్టుల్లో ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన క‌రుణ్ నాయ‌ర్
కరుణ్ నాయర్ తన టెస్టు కెరీర్ లో 303* స్కోరు తరువాత తొలిసారిగా ఓవ‌ల్ లో ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇది 9 సంవత్సరాల తర్వాత ఆయనకు టెస్టుల్లో వచ్చిన రెండో అర్ధ సెంచరీ కావ‌డం గ‌మ‌నార్హం.
25
వర్షంతో ఆటకు అంతరాయం

రోజు ప్రారంభంలో వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించినా, పిచ్‌లో త‌డివ‌ల్ల బాల్ స్వింగ్ క‌నిపించింది. పూజారా ఇచ్చిన పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది బ్యాటర్లకు సవాలుగా మారనుంది అన్న విషయం స్పష్టమైంది.

టాస్ గెలిచిన తర్వాత భారత జట్టు తమ ఆఖరి టెస్టులో నాలుగు మార్పులు చేసింది. బుమ్రా, పంత్, అంషుల్ కంబోజ్, శార్దూల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురేల్, ఆకాశ్ దీప్, కరుణ్ నాయర్ జ‌ట్టులోకి వ‌చ్చారు.

35
గిల్ అవుట్ తో కుప్ప‌కూలిన భార‌త్

శుభ్ మ‌న్ గిల్ అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో ఆకట్టుకున్నప్పటికీ, అనంతరం అట్కిన్‌సన్ చేతి ఓ తప్పుడు కాల్ తో రన్ తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. 21 పరుగుల వ‌ద్ద పెవిలియ‌న్ కు చేరాడు. గిల్ అవుట్ కావడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది.

సాయి సుధర్శన్ (38 ప‌రుగులు) నెమ్మదిగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేసినా, టంగ్ బౌలింగ్‌లో సూపర్ డెలివరీకి అవుట్ అయ్యాడు. గ‌త మ్యాచ్ లో సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన ర‌వీంద్ర జడేజా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 9 ప‌రుగుల వ‌ద్ద టంగ్ బౌలింగ లో అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ కూడా అట్కిన్‌సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

45
కరుణ్ నాయర్ ఒంటరి పోరాటం

వ‌రుసగా వికెట్లు ప‌డుతున్నా నిల‌క‌డ‌గా ఆడుతూ కరుణ్ నాయర్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 98 బంతుల్లో 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ట్రిపుల్ సెంచరీ (303* ప‌రుగులు) తరువాత టెస్టుల్లో అతని అత్యుత్తమ స్కోరు ఇదే. వాషింగ్టన్ సుందర్ (19* ప‌రుగులు) తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యం ఏర్ప‌రిచారు. ఇండియాకు ఈ ఇన్నింగ్స్ లో అత్యుత్తమ భాగస్వామ్యం.

భార‌త ఇన్నింగ్స్ సాగింది ఇలా..

85/3 (గిల్ రన్ ఔట్)

101/4 (సుద‌ర్శన్ ఔట్)

119/5 (జడేజా ఔట్)

153/6 (జురేల్ ఔట్)

224 ఆలౌట్ (సిరాజ్, ప్రసిద్ధ్ ఔట్)

రెండో రోజు ప్రారంభం నుంచి 30 నిమిషాల్లో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బౌలర్లు భార‌త్ కు షాకిచ్చారు. టంగ్, అట్కిన్‌సన్ సమర్థవంతమైన బౌలింగ్ దాడి చేసి భారత జట్టును కోలుకునే అవకాశం లేకుండా చేశారు.

55
బెన్స్ స్టోక్స్, గిల్ కామెంట్స్ వైర‌ల్

ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్స్ స్టోక్స్ మాట్లాడుతూ.. “ఈ సిరీస్ శారీరకంగా, మానసికంగా భారీ పరీక్షగా మారింది. ఇది టెస్టు క్రికెట్ ప్రాముఖ్యత చూపింది” అని అన్నారు.

భారత కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ మాట్లాడుతూ.. “ఈ సిరీస్ ప్రతి మ్యాచ్ అనిశ్చితంగా సాగింది. టీమ్‌గా చాలా నేర్చుకున్నాం. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయగలిగితే, అది గొప్ప విజయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నాడు.

లండన్ వాతావరణం మొదటి రెండు రోజులకు వర్షాభావం క‌నిపించింది. ఇది మ్యాచ్ పై ప్ర‌భావం చూపించింది. భారత్ టీమ్ బాల్‌ చేంజ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది, నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లాండ్ జట్టుకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.

ఇప్పుడు బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో భారత్ మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బాగా వినియోగించుకోవాల్సి ఉంది. పిచ్‌లో ఇంకా మలుపు, హమ్మింగ్ ఉన్నందున, భారత బౌలర్లు దీనిని పూర్తిగా ఉపయోగించుకుంటేనే మ్యాచ్ పోటీలోకి తిరిగి రావ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories