IND vs NZ: మూడు మ్యాచ్ లో టెస్టు సిరీస్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. టీమిండియా 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒక్క యశస్వి జైస్వాల్ మినహా భారత ఆటగాళ్లు ఎవరూ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే, భారత జట్టు ఓటమి తర్వాత నెటిజన్లకు విరాట్ కోహ్లీ టార్గెట్ గా మారాడు. లండన్ వెళ్లిపో అంటూ రన్ మిషన్ విరాట్ కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? కోహ్లీ ఎందుకు టార్గెట్ అయ్యాడు?
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో మూడో రోజు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. దీని తరువాత అభిమానులు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో కోహ్లీ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీతో కలిసి పరుగులు తీస్తున్న సమయంలో రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న పంత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇదే విషయం ఇప్పుడు కోహ్లీపై విమర్శలు రావడానికి కారణం అయింది.
రిషబ్ పంత్ రనౌట్ కు కోహ్లీకి ఏంటి సంబంధం?
న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 77(65) పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. దీని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ కేవలం మూడు బంతులు ఆడి రనౌట్ అయ్యాడు. ఇది ఇన్నింగ్స్ 23వ ఓవర్ రెండో బంతికి జరిగింది.
అజాజ్ పటేల్ వేసిన బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు ఆడిన కోహ్లీ, పరుగు చేసే ప్రయత్నంలో కోహ్లి పంత్‌కి కాల్ ఇచ్చి పరిగెత్తుతాడు. పంత్ అవతలి ఎండ్ లో నిలబడి ఉన్నాడు. వెంటనే సింగిల్ తీయడానికి పరిగెత్తాడు, కానీ అతను మరో ఎండ్‌కు చేరుకునే సమయానికి, ఫీల్డర్ బంతిని కీపర్ వైపు విసిరాడు.. పంత్ రనౌట్ అయ్యాడు. పరుగు రావడం కష్టంగా, అవసరం లేని సమయంలో విరాట్ పరుగుకు కాల్ ఇవ్వడంతో పంత్ రనౌట్ అయ్యాడని చెప్పవచ్చు.
Virat Kohli Bowled
అభిమానులు ఆగ్రహం
పంత్‌ను ఈ విధంగా ఔట్ చేయడం భారత్‌కు పెద్ద దెబ్బగా మారింది. దీంతో విరాట్ కోహ్లీపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక నెటిజన్ "సోదర, ఇది కోహ్లి తప్పు, అతను రిషబ్ పంత్‌ను అవుట్ చేశాడు. మరో నెటిజన్ 'రెండో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కారణంగానే రిషబ్ పంత్ రనౌట్ అయ్యాడు. నువ్వు విశ్రాంతి తీసుకో.. ఇంకా ఎందుకు లండన్ వెళ్లిపో" అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అనవసరంగా కోహ్లీ పరుగు కోసం కాల్ ఇచ్చాడని మరొకరు కామెంట్స్ చేశారు. ఇలా పంత్ ఔట్ కు కోహ్లీనే కారణం అంటూ మండిపడుతున్నారు.
సిరీస్ కోల్పోయిన భారత్
ఎడమచేతి వాటం స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ (13 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను దెబ్బకొట్టాడు. న్యూజిలాండ్ రెండవ టెస్ట్ మూడో రోజున 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. దీంతో పాటు భారత గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని కూడా అందుకుంది. భారత్‌కు 359 పరుగుల లక్ష్యం ఉండగా 60.2 ఓవర్లలో 245 పరుగులు మాత్రమే చేసింది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు 2012 లో భారత గడ్డపై టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరీస్ ను కోల్పోయింది.