IND vs NZ : W 0 0 0 W W.. ఒకే ఓవర్లో రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్.. ఆ తోపు బౌలర్ ఎవరో తెలుసా?

Published : Nov 13, 2026, 12:54 PM IST

ఒకే ఓవర్లో టీమిండియా స్టార్ క్రికెట్లర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్లను డకౌట్ చేశాడంటే అతడు తోపు బౌలర్ అన్నట్లేగా. ఈ సీన్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో కనిపించింది. ఆ బౌలర్ ఎవరో తెలుసా?

PREV
13
రోహిత్, కోహ్లీ, అయ్యర్ వికెట్లు తీసింది ఇతడే..

India vs New Zealand : ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ లో ఇప్పటివరకు భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించి మంచి ఊపుమీదున్న టీమిండియాకు నాలుగో వన్డేలో గట్టి షాక్ తగిలింది. ఆతిథ్య కివీస్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించడంతో భారత్ ఓటమి అంచుల్లో నిలిచింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం అసాధ్యం.

టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 334 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. అయితే ఇంతటి లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ విరుచుకుపడి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు... ఒక్క ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.

క్రీజులోకి వచ్చి మొదటి బంతిని ఎదుర్కొన్న రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇలా వికెట్ తో ఓవర్ ప్రారంభించిన హెన్రీ వికెట్ తోనే ఓవర్ ముగించాడు. ఐదో బంతికి విరాట్ కోహ్లీ, ఆరో బంతికి కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒక్కపరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు హెన్రీ.

23
సింగిల్ డిజిట్ కే నాలుగు వికెట్లు

334 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సింగిల్ డిజిట్ కే సగం వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్లో సున్నా పరుగులకే స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఔటవగా టీమ్ స్కోరు 9 పరుగల వద్ద ఉండగా మరో వికెట్ పడింది. 5వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ను జెమిసన్ ఔట్ చేశాడు. ఇలా టీమిండియా వికెట్ల పతనం కొనసాగింది.

33
సెంచరీతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్

ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ విల్ యంగ్ సెంచరీ, టిమ్ సీఫెర్ట్ హాఫ్ సెంచరీతో అదరగొట్టారు... వీరి సెంచరీ భాగస్వామ్యం కివీస్ భారీ స్కోరుకు పునాది వేశాయి. ముఖ్యంగా విల్ యంగ్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే... అతడు 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. సీఫెర్ట్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు.

ఓపెనర్లు సూపర్ ఇన్నింగ్స్ కి ఫిన్ అలెన్ మెరుపులు తోడయ్యాయి. అతడు కేవలం 30 బంతుల్లో 41 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా తలోచేయి వేయడంతో కివీస్ 333 పరుగుల భారీ స్కోరు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories