IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే

Published : Jun 27, 2026, 08:29 AM IST

IND vs IRE 1st T20 : అంతర్జాతీయ క్రికెట్లో మరో అద్భుతం జరిగింది. టీ20 క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా పేరున్న టీమిండియాను పసికూన ఐర్లాండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. 

PREV
16
ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి కారణాలివే..

Ireland vs India 1st T20 : అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఓనమాలు దిద్దుతున్న టీం ఐర్లాండ్. ఇదే సమయంలో దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతూ పిహెచ్డి చేసినంత అనుభవం టీమిండియాది. ఇలాంటి జట్ల మధ్య మ్యాచ్ అంటే వార్ వన్ సైడ్ ఉంటుందని అందరూ భావించారు... ఐర్లాండ్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిస్తుందని అనుకున్నారు. కానీ తీరాచూస్తే క్రికెట్లో తలపండిన భారత జట్టును పసికూన ఐర్లాండ్ ఓడించింది. అదీ ఏ ఒకటో రెండో పరుగులతో కాదు ఏకంగా 34 పరుగుల తేడాతో. అంటే టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిందన్నమాట.

స్వదేశంలో ఐర్లాండ్ అదరగొట్టింది అనేకంటే టీమిండియా చెత్తగా ఆడింది అని చెప్పవచ్చు. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సహా కీలక ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో విదేశీ గడ్డపై భారత్ మరో ఓటమిని చవిచూసింది. ఇలా ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి టాప్ రీజన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

26
1. టీమిండియా బౌలింగ్ వైఫల్యం

ఐర్లాండ్ టీంను భారత బౌలర్లు చాలా తక్కువ అంచనా వేశారు... కానీ మ్యాచ్ ఆరంభంలోనే వారి బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో అర్థమయ్యింది. ఆడుతూపాడుతూ వికెట్లు తీయవచ్చని... 100 పరుగులకే ఆలౌట్ చేయవచ్చని భావించిన టీమిండియా బౌలర్లకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడిచేయడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పాలి... దీంతో ఆ టీం 183 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది.

వరల్డ్ క్లాస్ బౌలర్లు అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ లు తేలిపోయారు... వికెట్లు పడగొట్టినా వారి స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేదు. బాగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక యువ బౌలర్ ప్రసీద్ కృష్ణను అయితే ఐర్లాండ్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు... కేవలం 4 ఓవర్లలోనే 57 పరుగులు పిండుకున్నారు. వాషింగ్టన్ సుందర్ కూడా 1 ఓవర్ మాత్రమే వేసి 19 పరుగులు ఇచ్చాడు. ఇలా బౌలర్ల వైఫల్యమే టీమిండియాను ముంచింది.

36
2. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్

వరల్డ్ నెంబర్ వన్ టీ20 టీమ్ తో ఆడుతున్నామన్న భయం ఐర్లాండ్ టీమ్ లో ఏమాత్రం కనిపించలేదు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు చాలా కాన్ఫిడెంట్ గా ఆడింది... ఆరంభం అద్భుతంగా లేకున్నా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో (36 బంతుల్లో 50 పరుగులు) అదరగొట్టాడు. మరో బ్యాటర్ గారెత్ డిలనీ 32 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో ఐర్లాండ్ 182 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

46
3. చేతులెత్తేసిన భారత బ్యాటర్లు

భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది... కాబట్టి 183 పరుగుల లక్ష్యం చాలా ఈజీ అనుకున్నారంతా. కానీ అనుకున్నంత ఈజీ కాదని ఆరంభంలోనే అర్థమయ్యింది... ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం కష్టమయ్యింది. అంతేకాదు విరామం లేకుండా వికెట్లు తీసి భారత్ ను కట్టడిచేశారు.

ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే 20 బంతుల్లో 49 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే 14 బంతుల్లో 25 పరుగులతో మెరిశాడు. మిగతా బ్యాటర్లు ఎవర్రూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇలా బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను ఓడించింది.

56
4. ఘోరంగా విఫలమైన భారత మిడిల్ ఆర్డర్

టీమిండియా మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యింది... మిడిల్ ఓవర్లలో వికెట్ల పతనం కొనసాగింది. సంజూ శాంసన్ (5 పరుగులు), ఇషాన్ కిషన్ (1 పరుగు) వెంటవెంటనే ఔటయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (3 పరుగులు) కూడా చేతులెత్తేశాడు. తిలక్ వర్మ (19 పరుగులు) కాస్సేపు పోరాటం చేసినా అది సరిపోలేదు. వాషింగ్టన్ సుందర్ (9 పరుగులు), అక్షర్ పటేల్ (15 పరుగులు), హర్షిత్ రాణా (8 పరుగులు) కూడా టీమిండియాను ఆదుకోలేకపోయారు… మొదట అభిషేక్ శర్మ, చివర్లో శివమ్ దూబే పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. మొత్తంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమిండియాను నిండా ముంచింది.

66
5. ఐర్లాండ్ అద్భుత ప్రదర్శన

 ఎలాంటి అంచనాలు లేకుండా టీ20 సీరిస్ ప్రారంభించిన ఐర్లాండ్ అద్భుతమే చేసింది. టీమిండియా వంటి వరల్డ్ టాప్ టీ20 టీమ్ ను ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొట్టారు. అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బలమైన టీమిండియాను ఓడించి తాము ఇక పసికూనలం కాదని నిరూపించింది ఐర్లాండ్.

Read more Photos on
click me!

Recommended Stories