IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ లో ఊచకోత సాగించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ అదగొట్టడంతో 13వ ఓవర్ లోనే భారత్ విజయాన్ని అందుకుంది.
26
సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన భారత్
కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో తొలుగ బౌలింగ్ చేయాడానికి నిర్ణయించుకున్నాడు. టీమిండియా నుంచి సూపర్ బౌలింగ్ రావడంతో ఇంగ్లాండ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోష్ బట్లర్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఒక వైపు వికెట్లు పడుతుంటే మరో వైపు బట్లర్ ఫోర్లు, సిక్సర్లలో తనదైన షాట్స్ ఆడుతూ 68 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్లలో ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ 132 పరుగులు చేసింది.
36
టీమిండియా బౌలర్లు కూడా అదరగొట్టారు. అలాగే, అద్భుతమైన క్యాచ్ లతో మంచి ఫీల్డింగ్ కనిపించింది. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. కీలక సమయంలో అవసరమైన వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
46
Image Credit: Getty Images
భారత్ ఊచకోత.. అభిషేక్ శర్మ విధ్వంసం
133 పరుగులు స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు అద్భుతమైన ఆరంభం అందించారు. సంజూ శాంసన్ 26 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ హాఫ్ సెంచరీ కొట్టాడు.
తిలక్ వర్మ 19* పరుగులు, హార్దిక్ పాండ్యాలు 3* పరుగులు చేసి 13వ ఓవర్ లో భారత్ కు విజయాన్ని అందించారు. 133-3 పరుగులతో విజయాన్ని అందుకున్న భారత్ ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న జరగనుంది.
66
చరిత్ర సృష్టించిన అర్ష్ దీప్ సింగ్
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడంలో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
96 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టాడు.