ఆ నలుగురు అవుట్.. టీమిండియా అంచనా ప్లేయింగ్ XI ఇదే!
ఈ మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరగనుంది. వరుణ్ చక్రవర్తి జట్టులోకి వస్తుండటంతో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. సుందర్‌తో పాటు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినా, అతనికి మరో ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
భారత జట్టు అంచనా ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.