India vs England: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ముందు భారత ప్లేయర్లు చేతులెత్తేశారు. భారత జట్టు ఓటమికి గల 5 ప్రధాన కారణాలు గమనిస్తే..
హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాస్.. టీమిండియా పరువు తీసిన బ్యాటర్లు
ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయింది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న భారత్‌కు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా దక్కకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ ఘోర ఓటమికి, సిరీస్ చేజారడానికి గల 5 ప్రధాన కారణాలను ఇప్పుడు చూద్దాం.
26
1. పవర్‌ప్లేలోనే కుప్పకూలిన టాప్ ఆర్డర్
భారీ లక్ష్య చేధనలో టీమిండియాకు అదిరిపోయే స్టార్ట్ అవసరం. కానీ భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మ్యాచ్‌లో కేవలం 19 బంతుల వ్యవధిలోనే భారత్ ఏకంగా 5 కీలక వికెట్లను కోల్పోయింది. టీ20 క్రికెట్ చరిత్రలో పవర్‌ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడం భారత జట్టుకు ఇదే తొలిసారి. అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), ఇషాన్ కిషన్ (13), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఈ చెత్త ఆరంభమే భారత్ ఓటమిని శాసించింది.
36
2. చెత్త షాట్ సెలెక్షన్.. అతి దూకుడు
పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరించకపోయినా, భారత బ్యాటర్లు మాత్రం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన షార్ట్ లెంగ్త్ బంతులను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒకరి తర్వాత ఒకరు బాదాలనే కసితో వికెట్లను సమర్పించుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ తాము అత్యంత ఘోరమైన, దారుణమైన క్రికెట్ ఆడామని ఒప్పుకున్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి ఇన్నింగ్స్‌ను ఎలా ప్లాన్ చేయాలో బ్యాటర్లు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.
3. ఇంగ్లాండ్ పేసర్ల అటాక్.. ఆర్చర్, టాంగ్ లీనల్ స్పెల్స్
ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టాంగ్ భారత బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఆర్చర్ కేవలం 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు జోష్ టాంగ్ కేవలం 28 పరుగులిచ్చి 4 వికెట్లతో భారత్ దెబ్బకొట్టాడు. వీరిద్దరూ వేసిన హార్డ్ లెంగ్త్, ఎక్స్‌ట్రా బౌన్స్ బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ 5 క్యాచ్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడంటే ఇంగ్లాండ్ బౌలింగ్ లైన్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
56
4. బౌలింగ్‌లో ప్లాన్ల వైఫల్యం.. ఇంగ్లాండ్ భారీ స్కోర్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ మొదట్లో కాస్త కష్టంగా ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ఆఖర్లో విల్ జాక్స్, సామ్ కరన్ మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 201/7 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లలో బంతులు వేయడంలో విఫలమయ్యారు. ఈ పిచ్‌పై 200 పరుగులు చేయడం చాలా ఎక్కువని శ్రేయాస్ అయ్యర్ కూడా మ్యాచ్ ముగిశాక పేర్కొన్నాడు.
66
5. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రెజర్
కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ఆయన కెప్టెన్సీ వహించిన గత 12 టీ20 మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. మైదానంలో జట్టును నడిపించడంలో, బౌలింగ్ మార్పులు చేయడంలో శ్రేయాస్ ప్లాన్లు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన శ్రేయాస్, వరుసగా 5 మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రిస్టల్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా భారత్ పుంజుకుంటుందో లేదో చూడాలి.