ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు ఫీట్... నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు...

First Published Aug 4, 2021, 8:25 PM IST

ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి సెషన్‌లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, కోలుకున్నట్టే కనిపిస్తోంది. రెండో సెషన్‌లో 50.2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు...

తొలి ఓవర్‌లో రోరీ బర్న్స్, బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ కాగా 27 పరుగులు చేసిన జాక్ క్రావ్లీని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. తొలి సెషన్‌లో 61/2 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు.  

రెండో సెషన్ ఆరంభించిన తర్వాత కొద్దిసేపటికే డొమినిక్ సిబ్లీ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు.  70 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన సిబ్లీ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

66 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్, జానీ బెయిర్ స్టో కలిసి ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమీ విడదీశాడు.

71 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన బెయిర్‌స్టో, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్‌కి వెళ్లిన టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది...

91 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, టెస్టుల్లో 50వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. ఈ తరంలో టెస్టుల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు జో రూట్...

జో రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (68), చంద్రపాల్ (66), అలెన్ బోర్డర్ (63), ద్రావిడ్ (63), రికీ పాంటింగ్ (62), కలీస్ (58), కుక్ (57), వీవీఎస్ లక్ష్మణ్ (56), సంగర్కర్ (52), జయవర్థనే (50), స్టీవ్ వా (50) ఈ ఫీట్ సాధించారు.

మూడు ఫార్మాట్లలో కలిసి 15751+ పరుగులు చేసిన జో రూట్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ 15737 పరుగుల రికార్డును అధిగమించిన జో రూట్‌కి గత 11 ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.

click me!