INDvsENG 1st ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఆ ఇద్దరికీ అవకాశం...

First Published Mar 23, 2021, 1:16 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే ఆరంగ్రేటం చేస్తున్నారు. 

టీ20 సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయాడు...
undefined
తన తమ్ముడు, భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా నుంచి వన్డే క్యాప్ అందుకున్న కృనాల్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. పాండ్యా బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యా మరణం తర్వాత కృనాల్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే...
undefined
భారత సారథి విరాట్ కోహ్లీ, ఉపసారథి రోహిత్ శర్మ కలిసి దాదాపు 13 నెలల తర్వాత కలిసి వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. చివరిసారిగా గత ఏడాది జవనరిలో కలిసి చివరి వన్డే ఆడారు వరల్డ్ నెం.1, నెం.2 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...
undefined
స్వదేశంలో ఇప్పటిదాకా 19 వన్డే సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డుకు (20 సెంచరీలు) ఓ సెంచరీ దూరంలో ఉన్నాడు. సచిన్ 160 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే, 92 ఇన్నింగ్స్‌ల్లో 19 వన్డే శతకాలు బాదాడు విరాట్...
undefined
టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే సిరీస్‌ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
undefined
స్వదేశంలో 9946 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో 54 పరుగులు చేస్తే... 10 వేల మైలురాయి అందుకుంటాడు. టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్ ఒక్కడే స్వదేశంలో 14 వేలకు పైగా పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు...
undefined
టెస్టు, టీ20 సిరీస్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్‌కి తొలి వన్డేలో చోటు దక్కింది. అతనితో పాటు కృనాల్ పాండ్యా స్పిన్ బౌలింగ్‌ చేయనున్నాడు.
undefined
టెస్టు, టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ వ్యవహారించనున్నాడు.
undefined
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
undefined
ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, బెయిర్ స్టో, మోర్గాన్, బట్లర్, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్
undefined
click me!