IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బంగ్లాదేశ్‌పై విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో లెజెండరీ ప్లేయర్లు సచిన్, పాంటింగ్, గంగూలీల రికార్డులు బద్దలు కొట్టాడు.
Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు అద్బుతంగా తన ప్రయాణం ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి విజయోత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీని మొదలుపెట్టింది.
గురువారం (ఫిబ్రవరి 20) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ రికార్డుల మోత మోగించాడు. రోహిత్ 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్ లో మరో మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 13 పరుగులు పూర్తి చేసిన వెంటనే వన్డే క్రికెట్‌లో 11000 పరుగుల మార్కును అందుకున్నాడు.
24
Rohit Sharma (Photo: X/@BCCI)
దిగ్గజాల రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ 11000 వన్డే పరుగులు సాధించడమే కాకుండా లెజెండరీ ప్లేయర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అత్యంత వగంగా 11వేల పరుగుల మార్కును అందుకున్న రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతను 261 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లు ఆడి 11000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం సచిన్ మాత్రమే కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలను కూడా రోహిత్ శర్మ అధిగమించాడు.
34
అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ ఎవరు?
వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు సాధించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. 222 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. 2019లో ఈ రికార్డును అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన క్రికెటర్లు
రోహిత్ శర్మ 11 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. మొత్తంగా సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 285 ఇన్నింగ్స్‌ల్లో 13963 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 11363 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 11,029 పరుగులు చేశాడు.