100, 100, 100.. రోహిత్ శర్మ సూపర్ రికార్డు

First Published | Sep 19, 2024, 4:24 PM IST

Rohit Sharma super record: భారత్‌-బంగ్లాదేశ్ మధ్య  రెండు టెస్టుల సిరీస్‌ గురువారం ప్రారంభం అయింది. ఈ టెస్టు సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఈ ఫార్మాట్ లో ఎవరూ చేయలేని అద్భుతమైన రికార్డును సాధించనున్నాడు.
 

Rohit Sharma super record: భారత స్టార్ బ్యాట్స్ మన్, కెప్టెన్ రోహిత్ శర్మ మరో అద్భుతమైన రికార్డును సాదించనున్నుడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం అయింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. చాలా కాలం తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లపైనే అందరి దృష్టి వుండగా, కింగ్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. 

అలాగే టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా నుంచి మెరుగైన ఆటతీరును అందరు కూడా ఆశిస్తున్నారు. జట్టు ప్రకటించడానికి ముందు బమ్రా కు విశ్రాంతి ఇస్తారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దృష్టిలో ఉంచుకుని బలమైన జట్టును బీసీసీఐ బరిలోకి దించింది.

ఈ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించాలనుకుంటున్నాడు. హిట్ మాన్ మరో గొప్ప రికార్డు నమోదు  చేయడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు.

Latest Videos


అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లో రోహిత్ శర్మ కూడా ఒకరు. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ కేవలం 16 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతని పేరిట 84 సిక్సర్లు నమోదయ్యాయి. రోహిత్ బ్యాటింగ్ చేసే పేలుడు శైలి ప్రకారం, అతను భారత్- బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లలో ఈ అద్భుతమైన రికార్డును సాధించగలడు.

అలా చేయడంలో అతను సఫలమైతే, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధిస్తాడు. రోహిత్ శర్మ ఇప్పటికే వన్డే, టీ20ల్లో 100 సిక్సర్ల ఫీట్ అందుకున్నాడు. 

మరో 16 సిక్సర్లతో టెస్టుల్లో 100 సిక్సర్ల ఫీట్ సాధించిన ప్రపంచంలోని నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 131 సిక్సర్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

రెండో స్థానంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ వున్నారు. అతను 107 సిక్సర్లతో తన టెస్టు కెరీర్‌ను ముగించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో 100 సిక్సర్లు కొట్టాడు.

టీ20 ఇంటర్నేషనల్‌లో అగ్రస్థానంలో రోహిత్ 

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 205 సిక్సర్లతో ఈ ఫార్మాట్ కు హిట్ మాన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఫార్మాట్‌లో 200 సిక్సర్ల సంఖ్యను తాకిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్.

రోహిత్ ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ కూడా. 620 సిక్సర్లతో నంబర్-1గా నిలిచాడు. అత్యధిక సిక్సర్ల విషయంలో వన్డేల్లో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది (351) తర్వాత అతని పేరిట 331 సిక్సర్లు ఉన్నాయి.

ఇక అంతర్జాతయ క్రికెట్ లో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ లలో అద్భుతమైన కెరీర్ ను కొనసాగించారు. టీ20 ల్లో 4321 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు వుండగా, అత్యధిక స్కోరు 121 పరుగులు. వన్డేల్లో 10866 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు వుండగా, అత్యధిక స్కోరు 264 పరుగులు.

టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ 4137 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 212 పరుగులు. 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!