IND vs AUS: ఎవరు ఇన్ ఎవ‌రు ఔట్ - భారత ప్లేయింగ్-11 లో ఎవ‌రెవ‌రున్నారు?

First Published | Nov 21, 2024, 4:06 PM IST

IND vs AUS:  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో వరుసగా ఐదవ సిరీస్ విజయంపై గురిపెట్టింది భార‌త్.. ఇదే స‌మ‌యంలో దశాబ్దం తర్వాత ట్రోఫీని తిరిగి కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది ఆస్ట్రేలియా జట్టు. మ‌రి తొలి టెస్టులో గెలిచేది ఎవ‌రు? 
 

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇరు జ‌ట్లు బిగ్ ఫైట్ కోసం ఎదురుచుస్తున్న త‌రుణం వ‌చ్చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుండగా.. ఈ సిరీస్ విజ‌యంతో త‌మ అధిప‌త్యాన్ని మ‌రోసారి చాటిచెప్పాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. 

నవంబర్ 22, శుక్రవారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ సిరీస్ రెండు జట్లకు ఎంతో కీల‌కం. 2018-19, 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై రెండు చారిత్రాత్మక విజయాలతో సహా గత నాలుగు సిరీస్‌లను గెలుచుకున్న ప్రస్తుత ట్రోఫీని కలిగి ఉన్న భారత్ ఇటీవలి పోటీలలో ఆధిపత్యం చెలాయించింది.

Rohit Sharma, Virat Kohli,

నవంబర్ 22 నుండి పెర్త్‌లో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ -  ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో వరుసగా ఐదవ సిరీస్ విజయంపై గురిపెట్టింది భార‌త్.. ఇదే స‌మ‌యంలో దశాబ్దం తర్వాత ట్రోఫీని తిరిగి కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది ఆస్ట్రేలియా జట్టు. మ‌రి తొలి టెస్టులో గెలిచేది ఎవ‌రు? అసలు ఇరు జట్లలో ఎవరెవరు ఉన్నారు? అనే విష‌యాలు గ‌మ‌నిస్తే.. 

భారత్-ఆస్ట్రేలియా మధ్య చాలా కాలంగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ శుక్రవారం (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో మొదటి టెస్టు జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో  భార‌త జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా విలేకరుల సమావేశం అందరి దృష్టి ఆక‌ర్షించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స‌హా అనేక ఇతర అంశాలను బుమ్రా ప్ర‌స్తావించారు.
 

Latest Videos


Virat Kohli, Jasprit Bumrah

ప్లే-11పై బుమ్రా ఏం చెప్పాడు?

ఈసారి తొలి టెస్టులో భారత్ ఏ 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. గాయంతో శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ రెండో బిడ్డ కారణంగా ఇండియాలో ఉన్నాడు. అయితే, మీడియా సమావేశంలో బుమ్రా ప్లే-11కి సంబంధించిన వివ‌రాల‌పై ఒక స్పష్ట‌త‌ను ఇచ్చాడు. 

తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఖరారు చేసినట్లు బుమ్రా తెలిపాడు. అయితే ఈ విషయం శుక్రవారం ఉదయం టాస్‌ సమయానికి మాత్రమే వెల్లడి కానుంది. 'మా ప్లేయింగ్ ఎలెవన్‌ని ఫైనల్ చేశాం, మ్యాచ్ ప్రారంభమయ్యేలోపు మీకే తెలుస్తుంది' అని తాత్కాలిక‌ కెప్టెన్ చెప్పాడు. శుభ్‌మన్ గిల్ గాయం కార‌ణంగా మ్యాచ్ కు దూరమ‌య్యే అవ‌కాశ‌ముంది. అలాగే రోహిత్ శర్మ తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా ఇండియాలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో భారత్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనే ఆస‌క్తిని పెంచింది. 

కంగారుల‌తో బిగ్ ఫైట్ కు సిద్ధంగా భారత జట్టు 

తొలి టెస్టుకు ముందు మీడియా సమావేశంలో బుమ్రా మాట్లాడుతూ.. 'గెలిచినప్పుడు సున్నా నుంచి ప్రారంభిస్తాం కానీ ఓడిపోయినప్పుడు అదే జరుగుతుంది. భారత్ నుంచి మేం ఎలాంటి భారం తీసుకురాలేదు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాం, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ మా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని' తెలిపాడు. మరోవైపు గత ఐదేళ్లలో భారత్‌తో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైందన్న విష‌యాలు ప్ర‌స్తావించాడు.  

భారత్ ప్లేయింగ్-11 అంచ‌నాలు ఇవే 

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు 

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్. 

ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.

click me!