టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్ లో హార్దిక్ పాండ్యా.. స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ, అర్ష్ దీప్ సింగ్

First Published | Nov 20, 2024, 4:25 PM IST

ICC T20I rankings : ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో టీ20 ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, టాప్ 10 టీ20 బ్యాట్స్ మెన్లలో తిలక్ వర్మ సంచలన అరంగేట్రం చేశాడు. 
 

ICC T20I rankings : ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో తిల‌క్ వర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే, హార్దిక్ పాండ్యా కూడా త‌న‌దైన ఆట‌తో ఆక‌ట్టుకున్నారు. దీంతో వీరిద్ధ‌రూ  ఐసీసీ తాజా ర్యాంకింగ్స్  స‌త్తా చాటారు. ఐసీసీ తాజా ర్యాంగింగ్స్ లో టీ20 ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, టాప్ 10 టీ20 బ్యాట్స్ మెన్లలో తిలక్ వర్మ సంచలన అరంగేట్రం చేశాడు. 
 

Tilak Varma

టీ20 ఫార్మాట్ లో చెప్పుకోదగ్గ విజయాలతో వైట్ బాల్ క్రికెట్ కు సంబంధించి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు మెరిశారు. ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో టీమిండియా డైనమిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ 3-1తో కైవసం చేసుకోవడంలో అద్భుత ప్రదర్శన చేసిన పాండ్యా అటు బ్యాట్ తో పాటు ఇటు బంతితోనూ కీలక పాత్ర పోషించాడు.


Arshdeep Singh

అలాగే, తెలుగు ప్లేయ‌ర్, భారత యువ బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ రెండు సెంచరీలు, 280 పరుగులతో ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తిల‌క్ వ‌ర్మ అద్భుత ప్రదర్శనతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (నాలుగో స్థానం)ను వెనక్కి నెట్టి టీ20ల్లో అత్యధిక ర్యాంక్ కలిగిన భారత బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. తిలక్ వ‌ర్మ‌తో పాటు దక్షిణాఫ్రికాపై తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శించిన భారత వికెట్  బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 22వ స్థానానికి ఎగబాకాడు.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ట్రిస్టాన్ స్టబ్స్ 23వ స్థానంలో ఉన్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో  హెన్రిచ్ క్లాసెన్ (59వ స్థానం) కూడా మెరుగయ్యాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ తో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ కూడా టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో గణనీయమైన పురోగతి సాధించారు.

ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ విజయం తర్వాత శ్రీలంక క్రికెటర్లు టీ20, వన్డే ర్యాంకింగ్స్ లో తమ ఉనికిని చాటుకున్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కుశాల్ మెండిస్ 12వ స్థానానికి ఎగబాకగా, వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో మహీష్ తీక్షణా ఆరో స్థానానికి ఎగబాకాడు. 

శ్రీలంక బ్యాట్స్ మెన్ మెండిస్, అవిష్కా ఫెర్నాండో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ కు చెందిన విల్ యంగ్ కూడా శ్రీలంకపై వరుస ప్రదర్శనలతో 22వ స్థానానికి ఎగబాకాడు.

Latest Videos

click me!