INDvsAUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే...

First Published Nov 26, 2020, 6:22 PM IST

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను వన్డే సిరీస్‌తో ఆరంభించనుంది టీమిండియా. నవంబర్ 27న ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగబోతోంది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైన సంగతి తెలిసిందే...

ఐపీఎల్ 2020 ఫైనల్ ముగియగానే ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు... 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ కూడా ముగించుకుని తొలిపోరుకి సిద్ధమైంది...
undefined
సుదీర్ఘ సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు వీలుగా వన్డే సిరీస్‌కు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీమిండియా...
undefined
గత పర్యటనలో వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్న టీమిండియా, ఈ టూర్‌ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది...
undefined
వన్డే డబుల్ సెంచరీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకపోవడం భారత జట్టుకి అతిపెద్ద లోటు కాగా... కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ఓపెనర్‌గా అదరగొట్టిన మయాంక్ అగర్వాల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది... లేదా కెఎల్ రాహుల్ కూడా ఓపెనర్‌గా రావచ్చు.
undefined
వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత కెఎల్ రాహుల్ లేదా మయాంక్ అగర్వాల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది.
undefined
సిడ్నీ క్రికెట్ మైదానం మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ మొదట బ్ాయటింగ్ చేసిన జట్లకే 80 శాతం విజయాలు దక్కాయి. అయితే టీమిండియా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
undefined
ఆస్ట్రేలియా 2:40 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్... భారత కాలమానం ప్రకారం 09:10 నిమిషాలకు మొదలవుతుంది... టాస్ వేసే సమయం 08:40
undefined
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లు సోనీ టీవీలో ప్రత్యేక్ష ప్రసారం కానున్నాయి. సోనీ సిక్స్ ఛానెల్‌లో తెలుగు, తమిళ్, ఇంగ్లీషు భాషల్లో కామెంటరీ వస్తుంది.
undefined
అలా సోనీ టెన్ 1 ఛానెల్‌లో ఇంగ్లీషులో, సోనీ టెన్ 3 ఛానెల్‌లో హిందీలో మ్యాచ్ ప్రత్యేక్ష ప్రసారం జరగనుంది. అలా సోనీ లివ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది..
undefined
click me!