INDvsAUS: ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదు... కారణం ఇదేనా...

First Published Oct 28, 2020, 6:46 PM IST

IPL మహా సమరం ముగిసిన తర్వాత భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు. నాలుగు టెస్టు మ్యాచులతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనున్న ఈ లాంగ్ సిరీస్ కోసం రెండు రోజుల ముందే జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు భారత జట్టులో చోటు దక్కడం పెద్ద చర్చకు దారి తీసింది. 

దాదాపు ఆరు నెలల కరోనా బ్రేక్ తర్వాత తొలిసారి విదేశీ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది భారత క్రికెట్ జట్టు. ఈ సిరీస్ విజయవంతమైతే తిరిగి యథావిథిగా క్రికెట్ జరగనుంది.
undefined
ఈ టూర్‌లో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌లకు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా ప్రకటించిన సెలక్టర్లు, టెస్టులకు అజింకా రహానేను, వన్డే, టీ20లకు కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
undefined
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారించే రోహిత్ శర్మ... వారం రోజుల కిందట జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత రెండు మ్యాచుల్లో బరిలో దిగలేదు ‘హిట్ మ్యాన్’.
undefined
దాదాపు రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ ఆసీస్ టూర్‌కి కూడా రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంతో ఐపీఎల్ మొత్తానికి ముంబై కెప్టెన్ దూరమయ్యినట్టే అని భావించారంతా... హిట్ మ్యాన్ లేకుండా ముంబై టైటిల్ గెలవగలదా? అని లెక్కలు వేయడం మొదలెట్టారు డిఫెండింగ్ ఛాంపియన్ అభిమానులు.
undefined
అయితే రోహిత్ శర్మ వేగంగా కోలుకుంటున్నాడని, నెట్స్‌లో హిట్ మ్యాన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు పోస్టు చేసింది ముంబై ఇండియన్స్. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
undefined
గాయం కారణం కాకపోతే రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఆసీస్ టూర్‌కి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఎప్పటినుంచో ఉన్న మనస్ఫర్థలే ఈ నిర్ణయానికి కారణం కాదు కదా? అని అనుమానిస్తున్నారు.
undefined
అయితే రోహిత్ శర్మను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడానికి అసలు కారణం అది కాదట.... గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే క్లారిటీ ఫిజియో ఇవ్వకపోవడమే ఇంత రచ్చకు కారణమట.
undefined
జట్టును ఎంపిక చేసే ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్టులను బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ గాయాన్ని పర్యవేక్షించిన టీమిండియా ఫిజియో నితిన్ పటేల్... అతని గాయం కోలుకోవడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని రిపోర్టు ఇచ్చాడట. దీంతో హిట్ మ్యాన్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయలేదట సెలక్టర్లు.
undefined
రోహిత్ శర్మను పరీక్షించిన వైద్యులు కూడా అతని గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించినట్టు తెలిపారు.
undefined
అయితే బీసీసీఐ చెప్పిన ఈ సమాధానంతో రోహిత్ ఫ్యాన్స్ శాంతించడం లేదు. ఇప్పటికే రోహిత్ శర్మ గాయపడి వారం గడిచింది. ఐపిఎల్ ముగియడానికి ఇంకో రెండు వారాల సమయం పట్టనుంది. ఆ తర్వాత రెండు వారాలకి కానీ ఆసీస్ టూర్ మొదలవదు.
undefined
అలా లెక్కలేసుకున్నా టూర్ మొదలయ్యే సమయానికి రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుంటాడు. మరి హిట్ మ్యాన్‌ను పక్కనబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. పటిష్ట ఆసీస్‌పై గెలవాలంటే రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ తప్పక అవసరముంటుందని అంటున్నారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు.
undefined
click me!