IPL 2020: నోరుజారిన తెలుగు కామెంటేటర్... ధోనీపై షాకింగ్ కామెంట్!

First Published Oct 28, 2020, 6:03 PM IST

IPL 2020 సీజన్ తుదిదశకు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తప్ప మిగిలిన జట్లన్నీ ప్లేఆఫ్ రేసులో నిలవడంతో మ్యాచులన్నీ ఇంట్రెస్టింగ్‌గా మారనున్నాయి. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో మరింత మజాను అందించాలి. అయితే ప్రాంతీయ భాషల్లో మాత్రం అలాంటి మజా దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ సంచలన కామెంట్‌తో వార్తల్లో నిలిచాడో తెలుగు కామెంటేటర్.

బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా తెలుగు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. 2019 క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసినవారిలో ఎమ్మెస్కే కూడా ఒకడు.
undefined
టూ డౌన్‌లో మంచి రికార్డు ఉన్న అంబటిరాయుడికి వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకపోవడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ డెసిషన్‌తో మనస్థాపం చెందిన అంబటి రాయుడు, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
undefined
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో తెలుగు వ్యాఖ్యాతగా వ్యవహారించాడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
undefined
ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందనే ప్రశ్న లేవనెత్తాడు మరో కామెంటేటర్. దీనికి తెలివిగా సమాధానం చెప్పాలని భావించిన ఎమ్మెస్కే నోరు జారి, ధోనీపై షాకింగ్ కామెంట్లు చేశాడు.
undefined
‘విరాట్ కోహ్లీ సెలక్టర్లను ఎక్కువగా నమ్ముతాడు. వారికి కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తాడు. ఓ ప్లేయర్‌ను ఎందుకు సెలక్ట్ చేశామో పర్ఫామెన్స్ రిపోర్టు చూపిస్తే చాలు ఒప్పుకుంటాడు. అలాంటి కెప్టెన్ ఉంటే సెలక్టర్ల పని ఈజీ అయిపోతుంది’ అన్నాడు ఎమ్మెస్కే ప్రసాద్.
undefined
అంతటితో ఆగి ఉంటే సరిపోయేది కానీ... ‘ధోనీ అలా కాదు. తాను కొందరు ప్లేయర్లు జట్టులో కచ్ఛితంగా ఉండాలని పట్టుబట్టేవాడు. దాంతో కాస్త ఇబ్బంది అయ్యేది’ అంటూ వ్యాఖ్యానించాడు ఎమ్మెస్కే ప్రసాద్. దీంతో మాహీ ఫ్యాన్స్, ఎమ్మెస్కేను ట్రోల్ చేస్తున్నారు.
undefined
భారత జట్టుకు రెండు వరల్డ్ కప్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి జట్టులో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అవగాహన ఉండదా? అని కామెంట్ చేస్తున్నారు.
undefined
6 టెస్టులు, 17 వన్డేలు మాత్రమే ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్... 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ధోనీపై కామెంట్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు.
undefined
మరికొందరైతే మహేంద్ర సింగ్ ధోనీ ఈవిధమైన ధోరణి కారణంగానే వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి లెజెండరీ క్రికెటర్లకి కెరీర్ చివర్లో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదని ట్రోల్ చేస్తున్నారు.
undefined
మరోవైపు వరుసగా ఫెయిల్ అవుతున్నా సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, ఆర్‌పీ సింగ్ వంటి వాళ్లను వరుస మ్యాచుల్లో ఆడించాడని ఎమ్మెస్కే వ్యాఖ్యలకు సాక్ష్యాలు చూపిస్తున్నారు.
undefined
మొత్తానికి విరాట్ కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాలనుకున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ ఎమ్మెస్కే, ఎమ్మెస్‌డీపై కామెంట్ చేసి సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చకు తెరలేపాడు.
undefined
click me!