ఓపెనింగ్ కోసం నలుగురు, స్పిన్నర్ కోసం ఇద్దరు, కీపింగ్ కోసం ఇద్దరు... భారత జట్టులో తీవ్రమైన పోటీ...

First Published Dec 15, 2020, 2:15 PM IST

మొదటి రెండు వన్డేలు ఓడినా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోష్ నింపుకుంది టీమిండియా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత బ్యాట్స్‌మెన్ రాణించారు. ఒక్క పృథ్వీషా మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమిష్టగా రాణించారు. దీంతో మొదటి టెస్టుకి ముందు తుది జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది...

వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వ్యవహారించిన శిఖర్ ధావన్‌కి టెస్టు టీమ్‌లో చోటు దక్కలేదు. ఇప్పటికే అతను స్వదేశం చేరుకున్నాడు. అయితే ఓపెనింగ్ కోసం నలుగురు పోటీపడుతున్నారు...
undefined
టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న యంగ్ ఓపెనర్ పృథ్వీషాతో పాటు శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నడుస్తోంది...
undefined
మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో రాణించడంతో పృథ్వీషా తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే...
undefined
కెఎల్ రాహుల్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మయాంక్ అగర్వాల్‌ వన్డేల్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి టెస్టుల్లో ఛాన్స్ ఇస్తారా? అనేది డౌట్...
undefined
ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యేది డే నైట్ టెస్టు మ్యాచ్. పింక్ బాల్‌తో ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగే ఈ టెస్టు మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్లు మాత్రం పక్కగా బరిలో దిగుతారు...
undefined
టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ పూజారా, హనుమ విహారి, అజింకా రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పాటు బౌలర్లు బుమ్రా, షమీ తుది జట్టులో ఉండడం పక్కా...
undefined
ప్రాక్టీస్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన ఉమేశ్ యాదవ్‌‌, నవ్‌దీప్‌ సైనీలకి కూడా తుది జట్టులో చోటు ఇచ్చే అవకాశం కష్టమే. ఎందుకంటే వీరికి బదులు సిరాజ్‌ను తుది జట్టులో ఆడేంచేందుకు కోహ్లీ మొగ్గుచూపే అవకాశం ఉంది.
undefined
మరోవైపు వికెట్ కీపర్ స్థానం కోసం వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది.
undefined
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేస్తే, రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే పంత్ కంటే సాహాకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపింది టీమిండియా...
undefined
మరోవైపు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉన్న కుల్దీప్ యాదవ్‌తో పోటీ నడుస్తోంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయలేకపోవడంతో అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కొచ్చు.
undefined
మొదటి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకున్నాడు. కాబట్టి బ్యాటింగ్‌ కూడా చేయగలిగిన జడ్డూ, అశ్విన్‌లకి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం...
undefined
మొదటి టెస్టులో కెఎల్ రాహుల్‌తో శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ వస్తారు... ఆ తర్వాత రహానే, హనుమ విహారి మిడిల్ ఆర్డర్ బాధ్యత మోస్తారు.
undefined
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు జడేజా, అశ్విన్, సిరాజ్, షమీ, బుమ్రా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను, బౌలింగ్ విభాగాన్ని మోసే అవకాశం ఉంది.
undefined
click me!