50 కాదు, 87 శాతం భారతీయులే... డేవిడ్ వార్నర్ వేషాల వెనక అసలు కారణం ఇదే...

First Published Dec 15, 2020, 1:21 PM IST

డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ అనే కంటే ఎక్కువగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అంటే చాలామందికి తెలుస్తుందేమో. ఎందుకంటే ‘డేవిడ్ భాయ్’, ‘వార్నర్ భయ్యా’గా  డేవిడ్ వార్నర్ తెచ్చుకున్న గుర్తింపు అలాంటిది మరి. క్రికెట్‌కి దూరంగా ఉన్నా, సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉండే డేవిడ్ వార్నర్... తాజాగా 5 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నాడు...

ఐపీఎల్ కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్... కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 2016లో టైటిల్ కూడా అందించాడు...
undefined
నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వార్నర్ భాయ్‌కి ఇండియాలో మంచి వెల్‌కం లభించింది. ఆ ఆదరణతో ఉప్పొంగిపోయిన డేవిడ్ వార్నర్ అప్పటినుంచి భారతీయులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు...
undefined
‘ఇండియా ఈజ్ మై సెకండ్ హోమ్’ అని చెప్పే డేవిడ్ వార్నర్‌కి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నాడు...
undefined
హైదరాబాదీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కంటే డేవిడ్ వార్నర్‌కే ఫాలోవర్లు ఎక్కువ... అంబటి రాయుడైతే దగ్గర్లో కూడా లేడు...
undefined
అల్లుఅర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి అంతర్జాతీయంగా క్రేజ్ తీసుకొచ్చిన డేవిడ్ వార్నర్... ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ పాటకు స్టెప్పులు వేసి సెలబ్రేట్ చేసుకున్నాడు...
undefined
‘బాహుబలి’, ‘సుల్తాన్’, ‘రోబో’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా ఏ సినిమానీ వదలకుండా ‘రీఫేస్’ యాప్‌తో వీడియోలు చేసే డేవిడ్ వార్నర్‌ ఫాలోవర్లలో భారతీయులే ఎక్కువ...
undefined
5 మిలియన్ల ఫాలోవర్ల మార్కును అందుకున్న డేవిడ్ వార్నర్, ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో చేసి పంపింది కూడా ఓ భారతీయుడే...
undefined
ఈ వీడియోపై కామెంట్ చేసిన ఓ నెటిజన్... ‘మీ 5 మిలియన్ల ఫాలోవర్లలో సగం మంది భారతీయులే ఉండొచ్చు కదా...’ అంటూ వార్నర్‌ను ప్రశ్నించాడు...
undefined
5 మిలియన్లలో 87 శాతం అంటే అంటే దాదాపు నాలుగున్నర మిలియన్లు. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు కూడా ఇంత ఫాలోవర్లు లేకపోవడం విశేషం.
undefined
దానికి సమాధానం ఇచ్చిన డేవిడ్ వార్నర్... ‘సగం కాదు... 87 శాతం భారతీయులే ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు. వార్నర్‌కి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణంగా అతని వీడియోలతో పాటు క్యూట్ ఫ్యామిలీ కూడా...
undefined
డేవిడ్ వార్నర్ కూతుర్లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కామెంట్ చేసిన వారికి ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చే వార్నర్... ఇక్కడి వారికి తెగ నచ్చేశాడు...
undefined
తనని ఎంతో అభిమానించే భారతీయుల కోసం, అందులోనూ తెలుగువారిని ఎంటర్‌టైన్ చేయడానికి వీడియోలు, డ్యాన్సులు చేస్తూనే ఉన్నాడు డేవిడ్ భాయ్...
undefined
భారత పౌరసత్వం తీసుకోవాలని వార్నర్‌కి చాలామంది సలహాలు ఇచ్చారు... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘డేవిడ్ భాయ్’ అనే సినిమా చేయాలని కూడా కామెంట్ చేశారు...
undefined
ఇలా ఫన్నీ కామెంట్లకు అంతే ఫన్నీగా రిప్లై ఇస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్... తెలుగు దర్శకులు ఆఫర్ ఇస్తే తప్పకుండా సినిమా చేస్తానని కూడా మాట ఇచ్చాడు...
undefined
click me!