విరాట్, రోహిత్ లేకపోతే భారత జట్టు చాలా వీక్... ఓడించడం చాలా ఈజీ... స్టీవ్ స్మిత్ కామెంట్స్!

First Published Nov 24, 2020, 5:53 PM IST

క్రికెట్‌లో విజయం కోసం ఏ చేయడానికైనా వెనకాడని జట్టు ఆస్ట్రేలియా. అందుకే కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యం చూపించింది ఆస్ట్రేలియా. ఇప్పుడు టీమిండియా టైమ్ నడుస్తోంది. అయితే ఇరుజట్ల మధ్య ఆధిక్యం ఎవ్వరితో తేలాలంటే ఆసీస్ టూర్‌లో టీమిండియా ప్రదర్శనే కొలమానం కానుంది. దీంతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు మాటల యుద్ధానికి తెర తీశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.

‘బాల్ టాంపరింగ్’ వివాదం కారణంగా నిషేధం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్... టీమిండియా గత పర్యటనలో ఆడలేకపోయారు...
undefined
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అదరగొడుతున్న ఈ ఇద్దరూ, ఈ పర్యటనలో టీమిండియాపై భారీ స్కోర్లు చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే తాను ఫామ్‌లోకి వచ్చానని ప్రకటించిన స్టీవ్ స్మిత్, భారత జట్టుపై మరిన్ని కామెంట్లు చేశాడు.
undefined
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా చాలా వీక్ అయిపోతుంది. వారిద్దరూ దూరం కావడం భారత జట్టుకి పెద్ద బొక్కే...’ అన్నాడు స్టీవ్ స్మిత్...
undefined
‘రోహిత్ వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ప్లేయర్. కొన్నేళ్లుగా అతను ఆడుతున్న క్రికెట్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. టాప్ ఆర్డర్‌లో అతను ఉంటే భారీగా పరుగులు వస్తాయి...
undefined
గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కావడం భారత జట్టుకు చాలా పెద్ద లోటు.. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ కూడా లేకపోతే ఆ జట్టు చాలా వీక్ అయిపోతుంది. అయితే భారత జట్టులో టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు...
undefined
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ ఐపీఎల్‌లో అదరగొట్టారు... రోహిత్, కోహ్లీ లేని లోటును ఈ ఆటగాళ్లతో పూడ్చాలని చూస్తోంది టీమిండియా... అది మంచి ఐడియానే...
undefined
వన్డే, టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఎంత ముఖ్యమో, టెస్టు ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ అంత ముఖ్యం. టెస్టుల్లో గ్రేట్ జాబ్ చేస్తున్న అతను, ఓ హై క్వాలిటీ ప్లేయర్....’ అని చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.
undefined
‘న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్ షార్ట్ పిచ్ బంతులను నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. రోజంతా అదే బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు అతను. అతనితో పోలిస్తే భారత బౌలర్లు నన్ను అంతగా ఇబ్బంది పెట్టరు అనుకుంటా... అతన్నే ఎదుర్కొన్న నేను, బుమ్రాను ఈజీగా ఫేస్ చేయగలను’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.
undefined
అయితే స్టీవ్ స్మిత్‌ను ఎలా అవుట్ చేయాలో చెబుతూ సచిన్ టెండూల్కర్ భారత బౌలర్లకు చిన్న హింట్ ఇచ్చాడు.
undefined
‘సాధారణంగా వికెట్లను లేదా నాలుగో వికెట్‌ను ఊహించుకుని పేసర్లు బౌలింగ్ చేస్తారు. అయితే క్రీజులో కదులుతూ బ్యాటింగ్ చేసే స్మిత్‌ను అవుట్ చేయాలంటే ఐదో వికెట్‌ కూడా ఉందనుకుని, దాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయాలి’ అంటూ వీడియో సందేశం ద్వారా తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్.
undefined
click me!