న్యూ జెర్సీలో సెల్ఫీ పోస్టు చేసిన శిఖర్ ధావన్... మ్యాచ్‌కి ముందే రివిల్ అయిన టీమిండియా కొత్త లుక్...

First Published | Nov 24, 2020, 4:55 PM IST

భారత్, ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సరికొత్త జెర్సీలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. టీమిండియాకి కిట్స్ స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న నైక్‌తో ఒప్పందం ముగియడంతో ఎమ్‌పీఎల్‌తో మూడేళ్ల అగ్రిమెంట్ చేసుకుంది బీసీసీఐ. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా ఆసీస్ టూర్‌లో కొత్త జెర్సీలో మెరవనుంది భారత జట్టు.

ఆస్ట్రేలియా టూర్‌లో మొదట వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ ఆరంభానికి ముందే సెల్ఫీ పిక్‌తో న్యూ జెర్సీని పరిచయం చేశాడు భారత ఓపెనర్ శిఖర్ ధావన్.
డార్క్ బ్లూ కలర్ జెర్సీలో ఎమ్‌పీఎల్ స్పోర్ట్స్, బైజూస్ ఇండియాతో కనిపిస్తున్న ఈ కొత్త జెర్సీ... సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు ఆడినప్పటి జెర్సీని గుర్తుకు తెస్తోంది...

భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా కూడా కొత్త జెర్సీలో కనిపించబోతోంది... కరోనా బ్రేక్ తర్వాత రెండు జట్లు కొత్త లుక్‌లో మెరవబోతున్నాయి...
అంతకుముందు శిఖర్ ధావన్, తన టీమ్ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇందులో కెఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహార్ ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ ఆడిన శిఖర్ ధావన్ 17 మ్యాచుల్లో 618 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న కెఎల్ రాహుల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలచాడు ‘గబ్బర్’.
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా కెఎల్ రాహుల్‌కి ఆసీస్ టూర్‌లో జరగబోయే పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లకు వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

Latest Videos

click me!