హనుమ విహారికి ప్లేస్ దక్కడం వాళ్లు తట్టుకోలేకపోతున్నారా... కెఎల్ రాహుల్‌‌పై ఎందుకింత ప్రేమ...

First Published Dec 26, 2020, 5:37 AM IST

భారత క్రికెట్ జట్టులో తెలుగు వాళ్లకి చోటు దక్కడమే చాలా అరుదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్నవాళ్లు చాలా తక్కువ. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ కంటే టాలెంటెడ్ క్రికెటర్ అయినా వీవీఎస్ లక్ష్మణ్‌కి లెజెండరీ క్రికెట్ స్థాయి గుర్తింపు దక్కలేదనేది వాస్తవం. ఇప్పుడు కూడా హనుమ విహారి విషయంలో అదే జరుగుతోందా?

మొదటి టెస్టులో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయినా, హనుమ విహారి టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో అతనికి రెండో అవకాశం ఇచ్చింది టీమిండియా...
undefined
యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌‌ను పృథ్వీషా స్థానంలో, గాయపడిన షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన టీమిండియా... వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చింది.
undefined
కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి తుది జట్టులో చోటు దక్కింది. జడేజా రాకతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలకు బలం చేకూరినట్టైంది.
undefined
అయితే కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు చాలా మంది నెటిజన్లు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా కెఎల్ రాహుల్‌ను బాక్సింగ్ డే టెస్టుకి ఎందుకు ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించాడు.
undefined
అయితే కెఎల్ రాహుల్ ఎంపిక కంటే హనుమ విహారిని ఎందుకు ఎంపిక చేశారనే విమర్శిస్తూ, బీసీసీఐ వైఖరిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...
undefined
ఇప్పటిదాకా 36 టెస్టులు ఆడిన కెఎల్ రాహుల్, 34.58 సగటుతో 2006 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
undefined
ఇప్పటిదాకా 10 టెస్టులు ఆడిన హనుమ విహారి... 33.88 సగటుతో 576 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే రాహుల్ విదేశీ పిచ్‌లపై ఫెయిల్ కాగా, హనుమ విహారి ఆడిన మ్యాచుల్లో అత్యధికం విదేశీ పిచ్‌లపైనే.
undefined
అదీకాకుండా ప్రాక్టీస్ మ్యాచుల్లో మిగిలిన బ్యాట్స్‌మన్ ఫెయిల్ అయినప్పుడు సెంచరీ చేసి, సత్తా చాటాడు హనుమ విహారి. అందుకే అతనికి ఇంకో అవకాశం ఇచ్చింది టీమిండియా.
undefined
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెఎల్ రాహుల్ కంటే హనుమ విహారికి మెరుగైన రికార్డు కూడా ఉంది. విహారి ఫస్ట్ క్లాస్ సగటు 57.28 కాగా కెఎల్ రాహుల్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ 46.58 మాత్రమే.
undefined
అదీకాకుండా ఆల్‌రౌండర్‌గా కూడా నిరూపించుకున్న హనుమ విహారి... అవసరమైన సందర్భాల్లో బౌలింగ్ కూడా చేయగలడు. అంతర్జాతీయ టెస్టుల్లో 5 వికెట్లు కూడా తీశాడు విహారి.
undefined
హనుమ విహారి లాంటి టెస్టు ప్లేయర్లు రాణిస్తే, సంప్రదాయ క్రికెట్ చూసే వారి సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా వన్డేలు, టీ20ల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన కెఎల్ రాహుల్... టెస్టుల్లో రాణించగలడా? అనేది అనుమానమే.
undefined
చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా చేరిన రోహిత్ శర్మ కోసం హనుమ విహారి తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది.
undefined
రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి రాణించినా, రాణించకపోయినా... మూడో టెస్టులో వారి స్థానంలో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఎంట్రీ ఇస్తారని సమాచారం.
undefined
పెద్దగా రాణించకపోయినా కొందరు బ్యాట్స్‌మెన్‌కు ఎన్నో అవకాశాలు ఇస్తున్నా టీమిండియా, నాలుగో స్థానంలో నిరూపించుకున్నా అంబటి రాయుడికి వన్డే వరల్డ్‌కప్ జట్టులో స్థానం ఇవ్వలేదు.
undefined
ఇప్పుడు విహారి విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తోంది. ఒక్క టెస్టులో విఫలమైనందుకే హనుమ విహారిని పక్కనబెట్టాలని డిమాండ్ చేస్తున్నవారిలో ఎక్కువ మంది పొరుగు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. కెఎల్ రాహుల్ స్థానంలో తెలుగోడికి చోటు దక్కడం వాళ్లు సహించలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
undefined
click me!