ఒకే రోజు మూడు టెస్టు మ్యాచులు... అసలు బాక్సింగ్ డేకి ఎందుకింత క్రేజ్...

First Published Dec 26, 2020, 6:30 AM IST

డిసెంబర్ 26.. బాక్సింగ్ డే. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్, శ్రీలంక -సౌతాఫ్రికా మధ్య కూడా టెస్టు మ్యాచులు జరగనున్నాయి. అసలు బాక్సింగ్ డే టెస్టు అంటే క్రికెట్ అభిమానులకి ఎందుకింత క్రేజ్? బాక్సింగ్ డే అంటే ఏమిటి... దానికి ఆ పేరు ఎలా వచ్చింది.

క్రిస్టమస్ తర్వాతి రోజే బాక్సింగ్ డే జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు పేరులో ఉన్నట్టు బాక్సింగ్ అంటే ఆట కాదు...
undefined
క్రిస్మస్ పర్వదినం తర్వాత క్రైస్తవ మతస్తులు, క్రిస్మస్ బాక్సులను పంచుకుంటారు. అలా బాక్సులు ఇచ్చే సంప్రదాయం నుంచి పుట్టిందే ‘బాక్సింగ్’ డే. అంటే బాక్సులు ఇవ్వడమే బాక్సింగ్ అన్నమట.
undefined
ఆంగ్లేయుల ద్వారా భారతదేశంలోకి క్రైస్తవం వచ్చినట్టే, ఈ బాక్సింగే డే సంస్కృతి కూడా బ్రిటీష్ పాలిత దేశాల్లోకి వ్యాపించింది.
undefined
క్రిస్మస్ పండగ ముగిసిన రోజు ఆటలు ఆడుతూ పని ఒత్తిడి మరిచిపోవాలనే ఉద్దేశంతో బాక్సింగ్ డే రోజును సెలవుదినంగా ప్రకటించారు... ఆస్ట్రేలియాలో క్రిస్మస్ కంటే బాక్సింగ్ డే ఘనంగా జరుగుతుంది.
undefined
ప్రతీ ఏడాది బాక్సింగ్ డే రోజున టెస్టు మ్యాచ్ ఆడడం ఆస్ట్రేలియాకి ఆనవాయితీగా వస్తోంది... అయితే మొదటి బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది.
undefined
1913లో జోహన్‌బర్గ్‌లోని ఓల్డ్ వండరర్స్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ సైయ్యద్ బర్న్స్ 8 వికెట్లు పడగొట్టాడు.
undefined
బాక్సింగ్ డే రోజున టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు.. ఇరు జట్ల మధ్య 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇంగ్లాండ్‌తో 122 టెస్టులు తర్వాత టీమిండియా అత్యధిక టెస్టు మ్యాచులు ఆడింది ఆస్ట్రేలియాపైనే.
undefined
అంతేకాదు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టీమిండియాకి ఇది 50వ టెస్టు మ్యాచ్.
undefined
ఇప్పటిదాకా బాక్సింగ్ డే టెస్టుల్లో నాలుగు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి.
undefined
విరాట్ కోహ్లీ సారథ్యంలో 2018లో తొలిసారి బాక్సింగ్ డే టెస్టులో విజయాన్ని అందుకుంది టీమిండియా...
undefined
బాక్సింగ్ డే టెస్టులో ఇప్పటిదాకా ఐదుగురు భారత క్రికెటర్లు టెస్టు ఆరంగ్రేటం చేశారు. 1999లో కనికర్, 2014లో కెఎల్ రాహుల్, 2018లో మయాంక్ అగర్వాల్ తొలి టెస్టు ఆడగా నేటి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ టెస్టు ఎంట్రీ ఇచ్చారు.
undefined
బాక్సింగ్ డే టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ రెండు శతకాలు చేయగా ఇప్పటిదాకా 8 మంది భారత క్రికెటర్లు టెస్టు శతకాలు బాదారు. 1987లో వెంగ్‌సర్కార్, విండీస్‌పై సెంచరీ చేయగా, 1992లో కపిల్‌దేవ్ సౌతాఫ్రికాపై సెంచరీ చేశాడు.
undefined
1998లో అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌పై శతకాలు చేయగా, 1999లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు సచిన్ టెండూల్కర్.
undefined
2003లో ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్, 2014లో ఆసీస్‌పై విరాట్ కోహ్లీ, అజింకా రహానే శతకాలు చేశారు. 2018 బాక్సింగ్ డే టెస్టులో పూజారా సెంచరీ చేశాడు.
undefined
click me!